నూతన పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ

Aug 10, 2026 - 01:13
Aug 10, 2026 - 01:14
 0  4
నూతన పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ
నూతన పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ

కోరుట్ల 10 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టగా తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణ జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్లతో కలిసి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ నూతన ఆసరా సామాజిక భద్రత పెన్షన్ దరఖాస్తు చేసుకొనుటకు ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు వయస్సు ధ్రువీకరణ పత్రము బ్యాంకు పాస్పోర్ట్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వర్గాన్ని బట్టి కులా లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి వితంతు పెన్షన్ అయితే భర్త ధ్రువీకరణ పత్రం దివ్యాంగుల పెన్షన్ అయితే సదరం సర్టిఫికెట్ గీత చేనేత కార్మికులు అయితే సంబంధిత సొసైటీ సభ్యత్వ ధ్రువీకరణ పత్రం తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా పెన్షన్ వచ్చేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ వైస్ చైర్మన్ షాహిద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం నాయకులు ఎడ్ల రమేష్ వాసిద్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు పెన్షన్ దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333