నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో తాగునీటి సమస్య ఉండకూడదు ఎమ్మెల్యే బిఎల్ఆర్
తెలంగాణ వార్త మిర్యాలగూడ మార్చి 4 :- ఈరోజు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో RWS , మిషన్ భగీరథ, ఇరిగేషన్ ,ఎలక్ట్రికల్ మరియు మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు సబ్ కలెక్టర్అమిత్ నారాయణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ మాట్లాడుతూఈ వేసవి కాలంలో రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఎక్కడా కూడా తాగునీటి కొరత లేకుండా కరెంట్ కోత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు
అనంతరం దామరచర్ల మండలంలో ఇండియన్ సిమెంట్ మరియు అంబుజా సిమెంట్(పెన్నా) యాజమాన్యంతో సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫ్యాక్టరీస్ యాజమాన్యంతో మాట్లాడుతూ ఇండియన్ మరియు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్న ప్రతీ గ్రామంలో త్రాగు నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకోవాలని సూచించారు అలాగే పరిసరరాలలో ఉన్న గ్రామాలకు కావాల్సిన విద్య, వైద్యం మౌలిక వసతులు తమ CSR ఫండ్స్ ద్వారా గ్రామాలకు అందజేయాలని సూచించారు.
అలాగే వాడపల్లి, ఇర్కిగూడెం, గణేష్ పాడ్, శూన్య పాడు గ్రామాలలో త్రాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ గ్రామాలలో తమ సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి గ్రామస్థులకు ఉచితంగా RO వాటర్ పంపిణీ చేయాలని సూచించారు అనంతరం అధికారులతో కలసి వాడపల్లి మిషన్ భగీరథ ప్లాంట్ సందర్శించి చుట్టూ గ్రామాలకు నీటి కొరత లేకుండా సరఫరా చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో అధికారులు మరియు సిబ్బంది తదితరులుపాల్గొన్నారు..