నిందితులను పట్టుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

Jun 21, 2024 - 19:29
 0  10
నిందితులను పట్టుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

- నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి...

- జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ..

జోగులాంబ గద్వాల 21 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  గద్వాల. జిల్లా కేంద్రంలోని వేదన నగర్ లోని వీర ప్రసాద్ ఇంట్లో పట్టపగలు జరిగిన దొంగతనం పై  బాధితులు  పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు నంద్యాల కు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేసరికి దొంగతనం జరిగినట్టు బాధితులు నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి,జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ లకు తెలిపారు.  ఈ విషయం తెలుసుకున్న మల్లు రవి మరియు సరితమ్మ బాధితుల   ఇంటికి వెళ్లి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించి,పోలీసు యంత్రాంగం త్వరితగతిన నిందితుల నుంచి చోరీ అయి వస్తువులు, నగదును రికవరీ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసు లకు సూచించారు...

వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి,పులిపాటి వెంకటేష్,ఇసాక్,లత్తిపురం వెంకట్రామిరెడ్డి, కొత్త గణేష్,షాష,మేస్తీ కృష్ణ తదితరులు ఉన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333