నిందితులను కఠినంగా శిక్షించాలి

Feb 24, 2026 - 04:40
 0  134
నిందితులను కఠినంగా శిక్షించాలి

  తిరుమలగిరి 24 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి చౌరస్తాలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లాలో రజకుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ,అలాగే శిశువు మృతికి కారణమైనటువంటి వారందరినీ చట్టపరంగా కఠినంగా శిక్షించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దాడి ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాల మీద జరిగినటువంటి దాడిగా భావిస్తున్నామని, ఇకముందు ఎలాంటి దాడులు జరిగిన సహించబమని హెచ్చరించారు. అలాగే బాధిత కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రజక మండల అధ్యక్షులు పులిమామిడి సోమన్న, ఉపాధ్యక్షులు ఓడ పెళ్లి సోమ నరసయ్య, ప్రధాన కార్యదర్శి పులిమామిడి వెంకన్న, కోశాధికారి పోరెల్ల వెంకన్న, గౌరవ అధ్యక్షులు నరసయ్య, పోరెళ్ల లక్ష్మయ్య,పట్టణ ప్రధాన కార్యదర్శి పులిమామిడి బిక్షం, మున్సిపాలిటీ రజక సంఘం గౌరవ అధ్యక్షులు పులిమామిడి మల్లయ్య,మున్సిపాలిటీ యూత్ అధ్యక్షులు అమలగంటి వెంకటేష్, రజక సంగం నాయకులు పులిమామిడి నరేష్,మండల నాయకులు జల్లయ్య, అనంతరం అధ్యక్షులు అంజయ్య,సామాజిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య, పూసల సంఘం రాష్ట్ర నాయకులు చేను శ్రీను, బీసీ సంఘం నాయకులు సుంకరి కిరణ్, మైనార్టీ నాయకులు ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి