**నా కుటుంబానికి ఏ హాని జరిగినా వారిదే బాధ్యత""స్థానిక కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాల చైర్మన్ నీలా*

Aug 9, 2025 - 18:31
 0  8
**నా కుటుంబానికి ఏ హాని జరిగినా వారిదే బాధ్యత""స్థానిక కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాల చైర్మన్ నీలా*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ..రావెళ్ళ నా కుటుంబానికి ఏ హాని జరిగినా వారిదే బాధ్యత.............. నాకు గాని నా కుటుంబానికి గాని ఏ హాని జరిగినా గింజల రమణారెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావులది బాధ్యత అని స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన రైస్ మిల్లు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా గింజల రమణారెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావులు నా వ్యాపార సంస్థలను, విద్యాసంస్థలను బ్రష్టు పట్టించే విధంగా అసత్య ప్రచారాలు, నిందారోపణలు చేస్తూ నన్ను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వారికి ఉన్న సమస్య ఏమిటో పరిష్కరించుకోమని పలుమార్లు అవకాశాలు ఇచ్చినా వారు సమాధానమివ్వకపోగా, తమకు అన్యాయం జరిగిందంటూ ప్రచారాలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. వారు పరిష్కార దిశగా రాకపోవడంతో తాను వారి ఇద్దరినీ గురు, శుక్రవారాలలో బహిరంగ చర్చకు రావాలని పత్రికా ముఖంగా కోరానన్నారు. రెండు రోజులలో ఇరువురు బహిరంగ చర్చకు రాకపోవడం విచారకరం. దీంతో వారికి నా వల్ల ఎలాంటి నష్టము, ఇబ్బంది కలగకున్నప్పటికీ నన్ను సమాజంలో దెబ్బతీసేందుకే అసత్య ప్రచారాలు, కుట్రలు చేస్తున్నారని భావిస్తున్నానన్నారు. వారి ఆగడాలకు పరాకాష్ట నాపై, నా కుటుంబ సభ్యులపై భౌతిక దాడులు చేసి, హత్యా ప్రయత్నం చేయడమన్నారు. వారిరువురూ బహిరంగ చర్చకు రానందున భవిష్యత్తులో నాపై అసత్య ప్రచారాలు, నిందారోపణలు చేయవద్దని, నా వ్యాపార సంస్థలకు విద్యాసంస్థలకు ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని, వారి వ్యవహార శైలి మార్చుకోవాలని కోరుతున్నానన్నారు. భవిష్యత్తులో నాకు గాని, నా కుటుంబానికి గాని ఎలాంటి ఇబ్బందులు, హాని జరిగినా వారిరూవూరు బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు .

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State