నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్

May 30, 2024 - 17:40
 0  10
నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్

జోగులాంబ గద్వాల మే 30 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. రైతులకు నష్టం జరగకుండా మంచి నాణ్యతమైన  విత్తనాలు ఉత్పత్తి చేయాలని  జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్  విత్తన ఉత్పత్తిదారులకు ఆదేశించారు.గురువారం ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాల్ నందు  విత్తన ఉత్పత్తి దారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ, రైతులకు ఏలాంటి సమస్యలు  తలెత్తకుండా  విత్తన ఉత్పత్తిదారులు   రైతులకు మేలు జరిగేలా మంచి విత్తనాలు అందజేయలన్నారు.  జిల్లాలో పంటలకు అవసరమైన అనుకూల వాతావరణం ఉన్నందున రైతులకు అహగాహన కల్పించి మంచి రకం విత్తనాలు అందజేయలన్నారు. నాసిరకం విత్తనాలు ఇవ్వరాదన్నారు. పంపిణీ అనంతరం రైతులకు అహగాహన కల్పించాలన్నారు. ఎస్.ఓ.పి  ఉల్లంగిస్తే  చట్టపరంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో డిమాండ్ కు  అనుగుణంగా మంచి విత్తనాలు పంపిణి  చేయాలన్నారు. రైతులు  నష్టపోకుండా  కంపెనిలు మంచి విత్తనాలు అందజేయాలని, జిల్లా యంత్రాంగం కంపెనీలకు పూర్తి సహకారం అందించడం జరుగుతుందని అన్నారు. 

     ఈ  సమావేశంలో  జిల్లా వ్యవసాయ అధికారి గోవింద నాయక్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వెంకటలక్ష్మి, విత్తన ఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333