నాగారం నూతన సీఐ గా డి నాగేశ్వరరావు

తిరుమలగిరి నాగారం 30 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా నాగారం మండలం సీఐగా డి నాగేశ్వరరావు నేడు బాధ్యతలు చేపట్టారు. నాగారం మండలం సీఐగా విధులు నిర్వహించిన రఘువీర్ రెడ్డిని హైదరాబాద్ ఐజీ కార్యాలయం కు బదిలీచేశారు. గతంలో హైదరాబాద్ ఐజి కార్యాలయంలో సీఐగా విధులు నిర్వహించి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, గంజాయి, అక్రమ ఇసుక రవాణా వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపారు......