**నల్ల బండ గూడెం"షిరిడి సాయిబాబా మందిరంలో భక్తులకు అన్నదానం"సుమారు 400 మంది భక్తులు*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ: *షిర్డీ సాయిబాబా మందిరంలో భక్తులకు అన్నదానం*
* వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు
* అన్నదానంలో పాల్గొన్న 400 మంది భక్తులు
కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామంలో ఉన్న శ్రీ షిర్డి సాయిబాబా మందిరంలో గుగులోతు శ్రీహరి అఖిల దంపతుల కుమారుడు వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా 400 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి గుడి చైర్మన్ నల్లపాటి నరసింహారావు ,కుటుంబ సభ్యులు బాబును ఆశీర్వదించారు..ఈ సందర్భంగా గుడి చైర్మన్ మాట్లాడుతూ...జన్మదిన వేడుకల్లో కూడా భక్తులకు అన్నదానం చేయడం మహా అద్భుతమని అన్నారు.ప్రతి గురువారం అన్నదానానికి సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో..మాజీ సర్పంచ్ ముండ్ర రంగారావు, ముండ్ర సాంబశివరావు, కొల్లూరు శేషు, అలస్కాని సర్వేశ్వరావు, గుగులోతు వెంకటేశ్వర్లు సుమతి, గుగులోతు శ్రీహరి అఖిల,వెంకటేశ్వర్లు, పార్వతి భక్తులు తదితరులు పాల్గొన్నారు.