నడిగడ్డ లో అక్రమ నిర్బంధాలను కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్
న్యాయం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తా ఉంటే అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటు కాంగ్రెస్ ప్రభుత్వంనకు
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
జోగులాంబ గద్వాల 7జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఈ సందర్భంగా శాంతియుత ధర్నా కార్యక్రమంనకు హాజరైన బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ... ఈ శాంతియుత ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ప్రాణం రక్షించాల్సినటువంటి వైద్యులే ప్రాణాలు తీస్తున్నారు గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది చాలా దుర్మార్గం. ముమ్మాటికీ ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరియు డాక్టర్లు కలిసి చేసిన హత్య. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్ వహించాలి.
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర శాంతియుతంగా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేస్తా ఉంటే అక్రమంగా అరెస్టు చేసి ధరూర్ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు. రేవంత్ రెడ్డి పాలనలో మరణాలకు హత్యలకు నిలయంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రులు. బాధిత కుటుంబ సభ్యుల్ని కూడా బలవంతంగా ఈడ్చుకెళ్ళి వ్యాన్లో ఎక్కించడం అని అన్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటే.. ఇది ప్రజా పాలన కాదు ప్రజా నిర్బంధన పాలన అని అన్నారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇందు విద్యార్థి ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ ఆదివారం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్న రోడ్డుపై కుటుంబ సభ్యులు రోడ్డుపైనే పడి విలపిస్తూ రోదించడం అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించడం బాధాకరం. ఆపేండెక్స్ కోసం ఆపరేషన్ ధియేటర్ లోకి వెళ్లిన ఇందు శవం అయి రావడం అత్యంత బాధాకరం.
తక్షణమే మరణించిన పాప కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా మరియు ఆ కుటుంబంలో ఒక పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ పాప మరణానికి కారకులైన డాక్టర్లను శాశ్వతంగా తొలగించాలి మరియు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా విధుల నుండి బహిష్కరించాలని జిల్లా కలెక్టర్ ని డిమాండ్ చేశారు.