నందిన్నె గ్రామంలో చలివేంద్రం ప్రారంభం
జోగులాంబ గద్వాల 9 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : కే.టి.దొడ్డి మండలం నందిన్నె గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ బోయ నాగమ్మ వెంకటేష్ ఆధ్వర్యంలో... బస్టాండు రహదారి ప్రక్కన చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.ఎండలు త్రీవంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు బాటసారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు నందిన్నె గ్రామంలో బస్టాండు పరిసర ప్రాంతంలో నందిన్నె గ్రామ పంచాయతీ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.