దేశంలో జైళ్లు సరిపోవడం లేదనే మాట అసంబద్ధం

Apr 7, 2024 - 19:31
Jun 30, 2024 - 13:23
 0  15
దేశంలో జైళ్లు సరిపోవడం లేదనే మాట అసంబద్ధం

ఖైదీలo దరూ నేరస్తులే నా అనే  విచారణ తక్షణ అవసరం.

 అయితే కనీస సౌకర్యాలు లేకుండా, విచారణ ఖైదీల పేరుతో హింసించడం  అప్రజాస్వామ్యం. 

తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన నెరగాళ్లను  శిక్షించడం కూడా అంతే ముఖ్యం.

--- వడ్డేపల్లి మల్లేశం 

కరుడుగట్టిన నేరస్తులు, తీవ్రవాదులు,  ప్రజా కంటకులు,  వ్యవస్థకు విద్రోహం తలపెడుతున్న వాళ్లు    చట్టం నుండి తప్పించుకు తిరుగుతూ పెద్దమనుషులుగా  చలామనవుతుంటే  విచారణ పేరుతో లక్షలాది మందిని ఖైదీలుగా మార్చి తే సంవత్సరాల తరబడి  విచారణ చేయకుండా  కటకటాల్లో  చిక్కి జీవితాలను బొగ్గు పాలు చేసుకుంటున్న వాళ్లు అనేకమంది ఉన్నారు.  ఈ రెండు సందర్భాలలోనూ ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి  అప్రజా స్వామికంగా వ్యవహరించడం  పెట్టుబడిదారులు  సంపన్న వర్గాల చేతిలో  ప్రభుత్వాలు పావులుగా మారిపోతున్న కారణంగా  నిజమైన దోషులకు శిక్ష పడడం లేదు .పైగా  నేరగాళ్లు   ప్రజా సేవకులుగా చలామనవుతున్నారు  ఈ వింత పరిస్థితిని  అడ్డుకోవాలంటే  న్యాయవ్యవస్థ అతిగా జోక్యం చేసుకోవాలి . ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు  ఉమ్మడిగా  నేరమయ రాజకీయాలను తొలి దశలోనే కట్టడి చేయడం ద్వారా  నేరస్తులను చట్టసభల్లోకి రాకుండా చూడాలి . ఒక అంచనా ప్రకారంగా ప్రస్తుత లోక్సభలో 83% మంది నేరచరిత్ర ఉన్నవాళ్లేనని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తుంటే  ఆ నేరస్తులు ఏ వర్గ ప్రయోజనం కోసం పని చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు  .చట్టసభల్లోకి రాకుండా చూడగలిగితే   పాలన కొంత మెరుగుగా ఉంటుందనేది వాస్తవం.  ఈ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి జైళ్లు  ఖైదీలకు సరిపోవడంలేదని  కిక్కిరిసిన స్థితిలో  జైళ్ల నిర్వహణ కొనసాగుతున్నదని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తుంటే  ఇందులో లక్షలాదిమంది ఎలాంటి నేరం చేయకుండానే  అరెస్ట్ అయిన విషయానికి మాత్రం ప్రభుత్వాలు సమాధానం చెప్పడం లేదు . నిజమైన నేరస్తులు తప్పించుకున్నా,  నేరం చేయని వాళ్ళు శిక్షించబడినా ఈ  రెండు అసంబద్ధమైన విధానాలకు  భారత న్యాయ శాస్త్రంలో ఈ రెంటికి తావు లేదు. అప్పుడప్పుడు న్యాయశాఖ జోక్యం చేసుకొని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విచారణ సంస్థలను ఆదేశించినప్పటికీ  విచారణ వేగవంతం కాకపోవడంతో దశాబ్దాల తరబడిగా  నేరస్తులుగా విచారణ ఖైదీలుగా ముద్రపడి జైల్లోనే తమ జీవితాలను  గడుపుతున్న దయనీయ పరిస్థితులకు  ఇప్పటికైనా చెక్  పెట్టాలి . జీవించే హక్కును కాలరాచే అధికారం  ప్రభుత్వాలకు లేదని రాజ్యాంగం స్పష్టంగా నొక్కి చెబుతున్న  చట్టాల ముసుగులో విచారణ పేరుతో  అమాయకులు శిక్షించబడుతూనేవున్నారు. మరొక్కవైపు  పిడికెడు మెతుకుల కోసం , ఉనికి కోసం, కనీస అవసరాల కోసం,  మనుగడ ప్రశ్నార్థకమైన సందర్భంలో  తప్పు చేసిన చిన్న నేరాలకు  లాకప్ డెత్ ల వరకు వెళ్లిన సందర్భాలను ఈ దేశంలో చూస్తే  అసమానతలు అంతరాలు ఏ రకంగా నేరస్తులుగా తయారు చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.  ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర  హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా  పార్లమెంట్లో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానములో  జైళ్ల పరిస్థితి పైన ఇచ్చిన వివరణ  చర్చించుకోవడం అవసరం.

జైళ్లు సరిపోవడం లేదా?   కనీస సౌకర్యాలు కొరవడినాయా?  విచారణ పేరుతో నేరం చేయకుండా శిక్షించబడుతున్నారా ?  చర్చించాలి  !

డిసెంబర్ 13, 2023వ రోజున  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం లో  భారతదేశంలో ఉన్న జైళ్ళ సామర్థ్యానికి మించి ఖైదీలు ఎక్కువగా ఉన్నారని  జైళ్లు సరిపోవడం లేదని  ప్రకటించడం  వెనుక  ఖైదీల సంఖ్య పెరగడానికి  నేరస్తుల  నమోదు రోజు రోజుకు ఎక్కువ కావడానికి  గల కారణాలను  ప్రభుత్వ లోపాలను  నిర్దేశించి ఉంటే బాగుండేది . దేశ వ్యాప్తంగా 1330 జైళ్లు ఉంటే  వాటిలో ఉండగలిగిన ఖైదీల సామర్థ్యం 4, 36,266   కానీ స్థాయికి మించి 5,73,220 మంది  కిక్కిరిసిన స్థాయిలో ఉంటున్నారని స్వయంగా మంత్రి ప్రకటించడం  దేశంలో  కనీసం ఖైదీల  సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేని దుస్థితిని తెలియజేస్తున్నది.  అనేక సర్వేల ప్రకారంగా  ఉన్న ఆ జైళ్లలో కూడా కనీస సౌకర్యాలు కొరవడి  దోమలు  ఇతర అనారోగ్య పరిస్థితులలో  తమ శిక్షను అనుభవిస్తున్నట్లు కనీసం మనుషులుగా  చూడనటువంటి అమానవీయ పరిస్థితులు  కొనసాగుతున్నాయని జైలు శిక్ష అనుభవించినటువంటి అనేకమంది బుద్ధి జీవులు మేధావులు  అక్రమ అరెస్టు పాలైనటువంటి వాళ్ళు ఎందరో  ప్రకటించిన దాన్ని బట్టి తెలుస్తుంది.  ముఖ్యంగా ఢిల్లీ ,ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ,బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని జైల్లో  అక్కడ ఉన్న సామర్థ్యానికి మించి  ఖైదీలు  ఉన్నట్లు  దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో  జైళ్ళ సామర్థ్యం కంటే ఖైదీలు తక్కువగా ఉన్నట్లు  మంత్రి సమాధానము ద్వారా తెలుస్తున్నది . నేరస్తులను శిక్షించడం ఎంత ముఖ్యమో  నేర విచారణ త్వరితంగా పూర్తిచేసి  నిర్దోషులకు   శిక్ష పడకుండా చూడడం  అంతే ముఖ్యం . ముఖ్యంగా భారతదేశంలో అనేకమంది బుద్ధి జీవులు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలతో పాటు  విప్లవ రచయితల సంఘం బాధ్యులు వరవరరావు  ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా  తో పాటు అనేకమంది మేధావులు అనేక సంవత్సరాలుగా  విచారణ పేరుతోనే జైలు శిక్ష అనుభవిస్తున్నారు.  నేరస్తులని రుజువైతేనే శిక్ష విధించాలి కానీ భారతదేశంలో అందుకు భిన్నంగా  విచారణ అనుమానం పేరుతో ఎన్ని సంవత్సరాలైనా  జైల్లో ఉంచవచ్చుననే నిబంధన కొనసాగుతూ ఉంటే  వీళ్ళందరూ ఏ రకంగా దోషులవుతారు?  అలాంటప్పుడు  జై లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని మంత్రి చేసిన ప్రకటనకు అర్థమే లేదు . బావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు  లేనటువంటి భారత ప్రజాస్వామ్యంలో  ప్రశ్నించి ప్రతిఘటిస్తే  నేరస్తులని ముద్ర వేసే దుర్మార్గ పరిపాలనలో  న్యాయవ్యవస్థ  మరింత  ముందు చూపుతో  ఆలోచిస్తేనే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి.  పాలకుల యొక్క వికృత చేష్టలకు అడ్డుకట్ట వేసి  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి  న్యాయ వ్యవస్థ జోక్యం అనివార్యం.  అలాకాని పరిస్థితిలో  ఇలాంటి ప్రకటనలు  నిరంతరం వెలువడుతూనే ఉంటాయి.

 కొన్ని గణాంకాలను పరిశీలిస్తే :

దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 77 జైళ్లు ఉంటే  అందులో 676oo ఖైదీల సామర్థ్యం ఉండగా  1,21, 6o 9 మంది ఖైదీలు  మగ్గుతుంటే , బీహార్ లోని 59 జైల్లో  47,750 మంది సామర్థ్యానికి గాను  64, 914 మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు.  మధ్యప్రదేశ్లో 132 జై లకు గాను  48,857 మంది ఖైదీలు ఉంటే  మహారాష్ట్రలోని 64 జైళ్ళల్లో 41,o 70 మంది ఖైదీలు,  పంజాబ్ లోని 26 జైల్లో 30,801 మంది ఖైదీలు,  జార్ఖండ్ లోని 32 జైళ్ళల్లో  19615 మంది,  ఢిల్లీలోని 16 జైళ్ళలో  18497 మంది ఖైధీ లు ఉన్నట్లుగా  తెలుస్తున్నది .

 న్యాయస్థానాలు దోషులుగా  నిర్ధారించిన వారి కంటే  విచారణ పేరుతోనే ఖైదీలు ఎక్కువగా ఉన్నట్లు  తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గమనించవచ్చు.  దీని అర్థం  నేరస్తులని రుజువు కాలేదు కానీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు . ఇది భారత ప్రజాస్వామ్య  మూల సూత్రానికి,  వైఫల్యానికి,  పాలకుల నిర్లక్ష్యానికి  మచ్చుతునకగా భావించవచ్చు.

ఉదాహరణకు తెలంగాణలోని 37 జైల్లో  7997 మంది సామర్థ్యం ఉంటే  6497 మంది మాత్రమే ఖైదీలు ఉన్నారు.  ఇది వేరే  ఇందులో దోషులుగా నిర్ధారించబడిన వారు 2,102 మంది మాత్రమే ఉంటే  విచారణ పేరుతో  నేరం రుజువు కాకుండానే  ఏళ్ల తరబడి జైల్లో శిక్ష అనుభవిస్తున్న వాళ్లు 4,221 మంది ఉండడం  విచారకరం, అవమానకరం కూడా.

  ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 106 జైళ్ళలో  8659 మంది ఖైదీల సామర్థ్యం ఉంటే  7254 మంది మాత్రమే ఖైదీలు ఉన్నారు.  కానీ  కోర్టులో నేరస్తులుగా నిర్ధారించిన వాళ్ళు 1 988 మంది మాత్రమే ఉంటే  విచారణ పేరుతో అక్రమంగా శిక్ష అనుభవిస్తూ  నేరస్తులు కాని వాళ్ళ సంఖ్య   5123  ఉంటే  ఈ దేశంలో  శిక్ష ఎవరికి పడుతున్నదో అర్థం చేసుకోవచ్చు.  నేరస్తులని రుజువైన కొద్దిమందితో పాటు  అనుమానంతో  అరెస్టు చేయబడిన 

 వాళ్లే ఎక్కువ సంఖ్యలో దశాబ్దాల తరబడి శిక్ష అనుభవించడాన్ని బట్టి చూస్తే  ఈ దేశంలో న్యాయం ఎంత నత్తనడక నడుస్తున్నదో అర్థం చేసుకోవచ్చు . కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  తన సమాధానములో  కేవలం సామర్థ్యం, ఖైదీల సంఖ్యను గణాంకాల రూపంలో తెలియజేయడం కాదు  నేర విచారణ పేరుతో అభాగ్యులు   శిక్ష అనుభవించడాన్ని కూడా అంగీకరించి ఉంటే బాగుండేది.  ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం  అతిగా జోక్యం చేసుకోవడంతో పాటు  సిబిఐ ఈడి  ఏసీబీ  ఇతర విచారణ సంస్థలకు  మానవ హక్కుల కమిషన్లకు  క్రింది స్థాయి న్యాయస్థానాలకు  కఠిన ఆదేశాలు జారీ చేయడం ద్వారా  విచారణను త్వరగా ముగించినట్లయితే  ఎంతోమంది  అన్నెం,పున్నెం ఎరగని అభాగ్యులు  బంధ విముక్తులయ్యే అవకాశం ఉన్నది.  ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు గండి కొట్టి  నేరస్తులని ముద్ర వేసి  శిక్షించే అధికారం  ప్రభుత్వాలకు ఎక్కడిది? అని  న్యాయ వ్యవస్థ ప్రశ్నించకపోతే  భారత ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలో కూరుకుపోయే అవకాశం ఉన్నది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి  జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333