దేదీప్యమానంగా జోగులాంబ నిజరూప దర్శనం..
జోగులాంబ గద్వాల 3 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: దేదీప్యమానంగా నైనానందకరంగా ఐదో శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు వసంత పంచమిని పురస్కరించుకొని పూర్ణాహుతి, అవభృత స్నాపనము పూర్తి చేసిన అనంతరం పంచామృతంతో సహస్ర ఘటాభిషేకం చేశారు.భక్తులందరూ కళశాలతో అమ్మవారిని అభిషేకించి దర్శించి తరించారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు గంటలపాటు క్యూ లైన్ లో నిలబడ్డారు.