దుర్గామాత విగ్రహ మండపాల ఏర్పాటుకు దరఖాస్తు

Sep 21, 2025 - 19:56
Sep 21, 2025 - 19:58
 0  8
దుర్గామాత విగ్రహ మండపాల ఏర్పాటుకు దరఖాస్తు

నమోదు చేయు లింక్ https://policeportal.tspolice.gov.in/index.htm

జిల్లా ప్రజలకు పోలీసు శాఖ తరపున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట.

దుర్గామాత నవరాత్రి ఉత్సవ మండపాల ఏర్పాటు సమాచారం పోలీసుకు ఇవ్వాలి, ఆన్లైన్ లింక్ నందు వివరాలు నమోదు చేసి పోలీసుల అనుమతి తీసుకోవాలని అన్నారు. ఉత్సవాలు ప్రశాంత వాతవరణంలో సంతోషకరంగా జరుపుకోవాలి అని జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు పోలీసు పటిష్ట రక్షణ కల్పిస్తుంది అన్ని కాలనీలు, అన్నీ గల్లీలో పెట్రోలింగ్ నిర్వహిస్తాం అన్నారు. మహిళలు అప్రమత్తమై ఉండాలని విలువైన అభరణాలు ఉత్సవాలు నిర్వహణ సమయంలో అనుమానితుల నుండి జాగ్రత్తగా ఉండాలి అన్నారు. పండుగలు సెలవుల దృష్ట్యా ఇండ్లకు తాళం పెట్టీ ఎక్కువరోజులు సొంత గ్రామాలకు, దూరప్రాంతాలకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి విలువైన వస్తువులు, అభరణాలు ఇంట్లో ఉంచకుండా వేట పెట్టుకోవాలి, లాకర్ లో పెట్టుకోవాలి. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు,. పిల్లలు అటల సమయంలో తల్లిదండ్రులు వారిపై కొంత నిఘా ఉంచాలి. పిల్లలు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదు అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333