దాతల సహకారంతో విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు.

Dec 12, 2024 - 20:57
Dec 13, 2024 - 12:18
 0  3
దాతల సహకారంతో విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు.

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- దాతల సహకారంతో విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు. ఆత్మకూర్ ఎస్. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం అదనపు తరగతుల సమయంలో స్నాక్స్ ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్ అన్నారు. గురువారం  కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బద్దం ప్రవీణ్ రెడ్డి 4000 రూపాయలతో బిస్కెట్లు ఇతర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి విద్యార్థుల కోసం గ్రామ గ్రామాన దాతలు ముందుకు వచ్చి విద్యార్థులు స్నాక్స్ తో పాటు పలు సౌకర్యాలు అందించి విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాత బద్దం ప్రవీణ్ రెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు తంగెళ్ల లక్ష్మీకాంతరెడ్డి జలగం మల్లేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.