దసరా పండుగ రోజున అశోక విజయదశమి జరుపుకుంటే మరింత సార్థకత ఉంటుంది
చారిత్రక అంశాలకు ప్రాధాన్యత నిచ్చినట్లే కాకుండా అహింస ప్రేమ అనురాగం మానవీయ కోణంలో జీవించడానికి ప్రేరణగా నిలుస్తుంది
మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు కళింగ యుద్ధం తర్వాత లక్షలాది సైనికుల మృత్యువాతను చూసి కలత చెంది ఏ విలువలకు ఈ హత్యలు యుద్ధ వాతావరణం అని పశ్చాత్తాపము నుండి అహింసా మార్గాన్ని అవలంబించడానికి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది మాత్రమే కాదు మానవీయ విలువల పునరుద్ధరణకు తోడ్పడేదిగా ఉంది. యుద్ధంలో ఏరులై పారిన రక్తాన్ని చూసి కలత చెంది శాంతి మార్గాన్ని స్వీకరించడానికి నిర్ణయం తీసుకొని బౌద్ధ ధర్మాన్ని అవలంబించినటువంటి చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ బౌద్దు లు, బౌద్ధ మత అభిమానులు, భౌతిక వాదులు జరుపుకునే పండుగనే అశోక విజయదశమిగా చరిత్రలో నిలిచిపోయింది. సుమారు 23 వందల సంవత్సరాలకు పూర్వం భారతదేశంలోని మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన అశోక చక్రవర్తి రాజ భోగాలు, అధికారం, హింస యుద్ధ వాతావరణం పౌరుషం యుద్ధం ద్వారా లభించిన ఫలితాన్ని అంచనా వేసుకున్నప్పుడు మనిషిని దూరం చేసుకున్న పౌరుషం యుద్ధం తో పని ఏమిటని ధర్మ మార్గంలో మనిషిని కాపాడుకోవడం ద్వారా నూతన విలువలకు శ్రీకారం చుట్టాలనే ఆలోచన అశోక చక్రవర్తికి రావడం అశోక విజయదశమి నేపథ్యం వెనుక ఉన్న అంతరార్థం.
ప్రాచీన భారతదేశంలో గణ రాజ్యమైన మగద పరిపాలించిన పదిమంది రాజులలో మూడవ చక్రవర్తిగా అశోకుడు భరతఖండంలోనే అత్యంత గొప్ప పాలకులలో ఒకరిగా నిలిచాడు అశోకుడు క్రీస్తుపూర్వం 2068 నుండి 232 వరకు అంటే 36 సంవత్సరాల పాటు పాటలీపుత్రం రాజధానిగా చేసుకొని ఒక్క సామ్రాజ్యాధినేతగా చరిత్రలో కొనసాగినది అద్భుత కల్పన కాదు నిజమైన చారిత్రక అంశం. తర్వాత సింహాసనం కోసం అశోకుడు ఇతర సోదరులకు మధ్య తీవ్రమైన నేపథ్యంలో క్రీస్తుపూర్వం 2061లో అంతర్యుద్ధంలో గెలిచి మగధ చక్రవర్తిగా స్థిరపడి 36 సంవత్సరాలు పరిపాలించి తన పాలనా కాలంలో కేవలం యుద్ధాలకు మాత్రమే పరిమితం కాలేదు రహదారుల నిర్మాణం చెట్ల పెంపకం ప్రజా జీవన రంగంలోని అనేక అంశాల పైన దృష్టి సారించడంతోపాటు ఆసుపత్రులు పాఠశాలలు ప్రజల మౌలిక అంశాల పైన శ్రద్ధ తీసుకొని సుపరిపాలన చేసినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. భారతదేశంలోని అంతర్గత పోరులో భాగంగా రాజ్యాలను ఆక్రమించుకోవడంలో భాగంగా 2061లో కలింగ రాజ్యాన్ని ఆక్రమించి జరిగిన యుద్ధంలో లక్షలాదిమంది చనిపోగా ఆ రక్తపాతాన్ని చూసిన అశోకుడు రక్తంతో సాధించిన విజయం కంటే ధర్మ మార్గములో మనసులను గెలుచుకోవడమే ప్రధానమని భావించి ఈ కళింగ యుద్ధం చివరి యుద్ధమని ప్రకటించి తన మనసు మార్చుకుని హింసకు అతీతంగా మానవతా విలువల పునాదిగా నూతన జీవితాన్ని ప్రారంభించడం కోసం అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి మనుషులంతా సమానమే అన్న ప్రాచీన బౌద్ధ మతానికి మరింత జీవం పోశాడు. అహింస, శాంతి తో, తోటి మనిషిని సాటి మనిషి గా చూసే మానవీయ కోణం నైతి విలువల పునాదిగా తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల్లో రాజ్యాలలో ప్రచారం చేయడానికి పూనుకోవడం రాజకీయ ఆధిపత్య భావజాలంలో వచ్చిన పెను మార్పుగా భావించాలి. అదే రకమైన పద్ధతులు కూడా ప్రజాస్వామ్య రాచరిక పరిపాలనలో కూడా మనిషిని కేంద్రంగా చేసుకున్న పాలన ఉంటేనే దానికి అర్థం ఉంటుందని అశోకుని ప్రేరణగా తీసుకొని నేటి పాలకులు పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది.
బౌద్ధమతంలోని సారాన్ని గ్రహించి దాన్ని విశ్వ వ్యాప్తం చేసే క్రమంలో భాగంగా తన కుమారుడు మహేంద్ర ని కుమార్తె సంఘమిత్రను శ్రీలంక భారత్ ప్రపంచంలోని ఇతర దేశాలకు పంపి బౌద్ధమత వ్యాప్తికి కృషి చేయించినాడు అంటే అశోకుని లో వచ్చిన పశ్చాత్తాపంతో కూడుకున్న మార్పు ఆ తర్వాత కాలంలో ఎంతగానో ప్రపంచాన్ని రాజ్యాలను రాజులను ప్రభావితం చేసినది అంటే అతిశయోక్తి కాదు .రాజరికం అంటే కేవలం ఆయుధాలు, యుద్ధాలు, దళాలు, అశ్వదలాలు, ఏనుగులు మాత్రమే అనుకుంటే పొరపాటు ప్రజాస్వామ్యంలో కొనసాగినట్టుగానే ఆనాడు ఆయన పరిపాలన కాలంలో ప్రజల జీవన అవసరాలను తీర్చడంతో పాటు రాజు తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు చేరవేయడానికి రాతి స్తంభాల పైన కొండలపైన శాసనాలు చెక్కించినవి నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి. మన జాతీయ చిహ్నమైనటువంటి మూడు సింహాల గుర్తు సార నాత్ లో ఉన్నటువంటి ఆయన నిర్మించిన స్థూపం నుండి స్వీకరించినదే. అంతేకాదు భారత జాతీయ పతాకంలో ఉన్నటువంటి 24 ఆకులతో కూడుకున్న అశోక చక్రం కూడా అశోకుడు నిర్మించిన స్థూపం లోని భాగమే కావడం ఆలోచించదగినది.
అశోక విజయదశమి
కళింగ యుద్ధంలో జరిగినటువంటి ప్రాణ నష్టానికి అశోకుడు తన నేరాన్ని బాధ్యతను అంగీకరించి కలత చెంది విడనాడి అహింసను గౌతమ బుద్ధుని ధర్మాన్ని స్వీకరించినటువంటి సందర్భంగా ఈ పరివర్తన జరిగిన దినమే అశోక విజయదశమిగా చరిత్రలో నిర్వహించబడుతున్నది.సాధారణంగా దుర్గాదేవి, రాక్షస సంహారము, రామ రావణ యుద్ధము, మహాభారత కథలోని కౌరవ పాండవ యుద్ధం సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యంలో సమాంతరంగా కొనసాగుతున్నటువంటి విజయదశమి సందర్భంగా దసరా ఉత్సవాలు నిర్వహించడం మానవ విశ్వాసాల పునాదిగా కొనసాగుతూ ఉంటే ఆ విశ్వాసాలలో భాగంగా రాముడు మంచివాడని రావణుడు రాక్షసుడని సీతను అపహరించి స్త్రీలకు ద్రోహం చేసినాడనే నె పముతో రాముడు రావణుని పై యుద్ధం ప్రకటించి అంతము చేసిన రోజుకు ఆనందంగా గుర్తింపు కోసం నేడు విజయ దశమి పండుగ జరుపుకోవడం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. అయితే అశోక విజయదశమి కి సంబంధించి ఆయన పరిపాలన యుద్ధాలు, పశ్చాత్తాపానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం పౌరాణిక ఇతిహాసాల ద్వారా వ్యక్తమవుతున్నటువంటి విజయదశమి ఆనవాళ్లు సాంప్రదాయ దసరా పండుగ కు లేదు .అయినా ప్రజల మనోభావాలను అంగీకరించి తీరాల్సినటువంటి సందర్భంలో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కానీ రాముని మాదిరిగానే రావణున్ని కూడా నచ్చి మెచ్చే సమర్ధుడని అంగీకరించే ప్రజలున్నటువంటి ఈ దేశంలో వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా రావణుని బొమ్మలో టపాసులు పెట్టి కాల్చి దహనం చేసే ప్రక్రియ మానవ విలువలకు తీవ్ర విఘాతం కలిగించే అంశం అని దేశవ్యాప్తంగా ఈనాడు పెద్ద ఎత్తున ప్రతిఘటన రావడాన్ని కూడా గ్రహించవలసిన అవసరం ఉంది.
బుద్ధి జీవులు మేధావులు ప్రజలు ఆలోచించాలి
మరో చారిత్రక అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించక తప్పదు. 1956 అక్టోబర్ 14వ తేదీ ఆరోజు విజయదశమి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాగపూర్ లోని దీక్ష భూమి లోపల లక్షలాది మంది తన అనుచరులు బౌద్ధులు బౌద్ధమత విశ్వాసకుల సమక్షంలో బౌద్ధ మతాన్ని స్వీ కరించి మానవ విలువలకు కొత్త నిర్వచనం ఇచ్చారు అందుకే ఈ రోజును దమ్మచక్ర పరివర్తన దినంగా కూడా జరుపుకుంటారు. బౌద్ధమత సారాన్ని విశ్వసించి యుద్ధాలకు తిలోదకాలు ఇచ్చి చారిత్రక పురుషునిగా నిలబడినటువంటి అశోక చక్రవర్తి తన పశ్చాత్తాపం తర్వాత బౌద్ధ మతాన్ని విస్తరింప చేసి మానవతా విలువల పట్ల పెద్ద మనసుతో వ్యవహరిస్తే ఆయన మార్గంలో ఆయన వ్యాప్తి చేసిన బౌద్ధమత సారాన్ని మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బౌ ద్ధ మతాన్ని స్వీకరించడమే కాకుండా దాని వ్యాప్తికి ఇ తోదికంగా సహకరించి సమానత్వం లేని మతాల కంటే బౌద్ధ మతంలోనే ఆధిపత్య భావన లేనటువంటి సమ భావన ఉందని అందుకే దాన్ని ఆచరించినట్లు తెలియజేస్తూ ఎంతోమందికి ఆ సారాన్ని అందించిన విషయం మనందరికీ తెలుసు. అంబేద్కర్ తన రచనలు ఆచరణ ప్రసంగాల ద్వారా. ఆధారాలు ఉన్నటువంటి వాస్తవాలను అంగీకరించడం ద్వారా చరిత్రకు మరింత పదును పెట్టాల్సినటువంటి బాధ్యత బుద్ధి జీవులు మేధావులు సామాన్య ప్రజల పైన ఉంది. అసమాన పద్దతిలో మెజారిటీ ప్రజలు ఒక ప్రవాహములో వెళుతూ ఉంటే దానికి భిన్నంగా సమాంతరంగా వాస్తవానికి సంబంధించిన విషయంగా అశోక చక్రవర్తి విజయదశమిని నిర్వహించుకోవడం ద్వారా ఆనాటి చరిత్రను వాస్తవాన్ని దాని వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించవలసిన మన బాధ్యతను నెమరు వేసుకున్నట్లు అవుతుంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో బుద్ధ విహారులలో బౌద్ధులు ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు యాత్రలు చేయడం ద్వారా మానవత్వానికి జీవం పోస్తున్నారు. అహింసను జీవితంలో భాగంగా మలుచుకున్నారు ఆ పరిణామ క్రమం నుండి మనం కూడా మన బాధ్యతలను కర్తవ్యాన్ని గుర్తించడానికి సిద్ధపడకపోతే మన విజ్ఞతకు ఏం ప్రయోజనం?.
చరిత్ర పురుషులైన అశోక చక్రవర్తి యొక్క పరిపాలన విధానాన్ని పాలనా సంస్కరణలను ప్ర జోపయోగ కార్యక్రమాలను ప్రజా దృక్పథాన్ని మానవతా విలువలను నేటి తరం పాలకులు జీర్ణించుకోవడంతోపాటు అశోక చక్రవర్తి విజయదశమిని బుద్ధిపూర్వకంగా ప్రభుత్వ పరంగా నిర్వహించడం ద్వారా తమ చిత్తశుద్ధిని నిబద్ధతను చాటుకోవాల్సిన అవసరం ఉంది .అదే సందర్భంలో కొందరి ప్రజల మనోభావాలను దెబ్బతీసే రావణ వధ పర్యావరణానికి ద్రోహం చేసే పద్ధతిలో కొనసాగించడములో కూడా ప్రభుత్వాల జోక్యం ఉండకుండా చూడాలి. అవసరమైతే మానవీయ కోణంలో రావణ వదను నిలుపుదల చేయడానికి కృషి చేయాల్సిందిగా ప్రజలు ప్రజాస్వామిక వాదులు మానవతావాదులు చేస్తున్న విజ్ఞప్తిని ప్రభుత్వాలు ఆలోచిస్తాయని ఆశిద్దాం.
---వడ్డేపల్లి మల్లేశం
--=20....10....2026-------(దసరా స్పెషల్ )
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)