దగా కోరు కేసీఆర్ కు కష్ట జీవుల బిడ్డ... క్రాంతి త్రినేత్రుడు బహిరంగ లేఖ

Mar 20, 2024 - 14:21
Mar 20, 2024 - 17:12
 0  20
దగా కోరు కేసీఆర్ కు కష్ట జీవుల బిడ్డ... క్రాంతి త్రినేత్రుడు బహిరంగ లేఖ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్  దగా కోరు కెసిఆర్ కు కష్టజీవుల బిడ్డ తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు బహిరంగ లేఖ ఏమి సాధించారు మిత్రమా.! ఎ క్కడ మొదలై ఎలా ముగిసింది ప్రస్థానం..! చింతమడక, సిద్దిపేటను దాటి సింగపూర్ లు స్విస్ బ్యాంకులంటూ పరుగెత్తిన మీ ప్రయాణం మళ్ళీ మూలానికే కదా వచ్చింది. ఏవీ ఆ మంగళ వాయిద్యాలు, ఏవీ ఆ నీరాజనాలు, ఏవీ ఆ రాజభోగాలు. మీ అడుగులకు మడుగులొత్తే మందిమాగధులేరి...? మీరేం చెప్పినా వహ్వాలు పలికే విదూషకులేమైరి..? కళ్ళముందే కూలిపోయిన స్వప్నాలు, కన్ను పొడుచుకున్నా కానరాని వెలుతురు..! ఎలా జీర్ణించుకుంటున్నావు మిత్రమా..? అవినీతి అనే పాము నోట్లో తలపెట్టినప్పుడు ఊహించి ఉండవు కదా అది నిన్ను మింగేస్తుందని...! అంతులేని ప్రజల ప్రేమాభిమానాలకంటే అత్యంత విషపూరితమైన కట్లపాములాంటి నోట్లకట్టలపైకి నీకు మనసెలా పోయింది మిత్రమా.? ఈమధ్య మీరు చేస్తున్న సమీక్షలు పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టు లేదు, గతించిపోయిన మీ గతాన్ని తవ్వుతున్నట్టు అధికారాంతమున చూడవలె అయ్యగారి లీలలు" అన్నట్టుగా నీ మొహంలో ఆ ముందు కాంతులేవి మిత్రమా..? ఇప్పుడే ఆ హితులు స్నేహితులు...? కొందరప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరున పెట్టిన ఆస్తిపాస్తులను తిరిగివ్వటానికి మనసొప్పక వాటిని చక్కదిద్దుకునే పనిలో పడటం, మరికొందరు వారు ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పించుకోవాలని యోచించటం ఇది కదా అసలైన జీవితసత్యం...! అధికారంలో ఉండి కూడబెట్టిన వేల ఎకరాల భూములకన్నా స్వగ్రామంలో మీ స్వార్జితం ఎనిమిది ఎకరాలేంటో విలువగా తోయటం లేదా ఇప్పుడు...? ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ నేను నా ముసల్ది మాత్రమే ఉన్నాం.. నా ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిలయ్యారు..నాకే స్వార్ధం లేదు, నాకు ఏ పదవులు వద్దు నేను తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటాను" అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం నమ్మి నాయకుణ్ణి చేసారు...! దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తాను" అని చెప్తే నమ్మిన బడుగుజీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేసారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా మిత్రమా..? ఈ దగా కు ఏం పేరు పెడతారు, వారి త్యాగాలను ఏ త్రాసుతో కొలుస్తారు..? స్వరాష్ట్రం కోసం, ఒక మానవీయమైన మార్పు కోసం బుల్లెట్లకు ఎదురెళ్లిన యువతరం తెగింపు..చావును ముద్దాడిన వారి త్యాగఫలం కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు మిత్రమా...? అంతులేని మీ ధనదాహం ముందు నిరుద్యోగ యువత ఆక్రందనలు వినిపించలేదా, పౌర హక్కులు కనిపించలేదా? అంత నిరంకుశమేల మిత్రమా...? బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేకమేడ ఎన్నాళ్ళుంటుంది మిత్రమా...? ఎప్పుడైనా కూలిపోవాల్సిందే కదా...! పులిరాజాగా ఉద్యమంలో ముందుకు పోతూ మీ పంజా కింద నలిపేసిన లేళ్ళు, దుప్పిలు, కుందేళ్ల మాటేమిటి మిత్రమా...? మీరిప్పుడు కట్టుకున్న బంగళాలు, పోగేసుకున్న సంపద ఏది మీ ప్రతిష్టను తిరిగి తీసుకురాలేదు కదా...! మీకు ప్రజల గుండెల్లో విశాలమైన గూడు ఉండగా ఇరుకైన పాలరాతి మేడలెందుకు మిత్రమా...? ప్రజల మనసుల్లో కొలువై ఉంటే మహా భాగ్యాన్ని వదులుకొని భోగభాగ్యాల వెంట పరుగులెందుకు...! జనం ఆదరణ కోల్పోయి సంపాదించేవి రత్నాలైనా రాళ్ళతో సమానమే కదా..? ఎత్తులు వేయటంలో, వ్యూహాలు రచించటంలో కనుచూపు మేర మీకు సరిజోడు అయిన నాయకుడున్నాడా..? ఆ రాజనీతిజ్ఞత, దర్శనికత ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాలు వాళ్ళ గుండెల్లో ఉండిపోయేవాళ్ళు కదా..! ఎందుకొచ్చిన మాయదారి సంపద.. ఏం చేసుకోను.? మీ ముందు తరాలను సోమరులను చేయటానికి కాకపొతే...! మీరు పోగేసుకున్న సంపదలో అర శాతం కూడా మీ జీవితకాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకొచ్చిన ఆరాటం..? ఆ సంపద పోగేసుకునేలా మీ ప్రతినాయకుణ్ణి మీరే సృష్టించుకోవటం, మీ ఓటమికి మీరే ఇటుకలు పేర్చుకోవటమే కదా వైచిత్రి అంటే...! సైజు పెద్దదిఅయిన అంగీల అలవాటు లేని అపోజిషన్ లో మీరు అవస్థలు పడుతుంటే ఆనందపడేవారే గాని అయ్యో అనేవాళ్ళు లేకపోవటం ఎంత దుర్భరం మిత్రమా...! ఉద్యమంలో మీరు చేసిన బసలు అధికారంలో ఉన్నాయి మీ శత్రువు ఆచరిస్తున్నాడు... గమనించారా..? ప్రజాస్వామ్యంలో అధికార క్రతువును నిర్వహించడం ఎలాగో అతని నుంచైనా మీరు నేర్చుకుంటారా..? ఓటమి ఎప్పుడూ చివరి మజిలీ కాదు, అదెప్పుడూ తాత్కాలికమే..! కానీ ఓటమి.. గెలుపుగా మారాలంటే అన్నీ ఒదులుకొని మళ్ళీ బయలుదేరిన చోటుకి రావాలి... ...??? ఇట్లు, కష్టజీవుల బిడ్డ... బాధితుల బంధువు.... సామాజిక పరివర్తకుడు, ప్రజా ఉద్యమాల శ్రేయోభిలాషి ... ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎం ఎల్ సెక్రటరీ.... కామ్రేడ్ JKR gari JSR sir జె కె ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ ( Jai Bharat mahavir Kranti trinetrudu Rishi Bora Devansh JKR gari.... Jai shree ram Subhash Chandra Bose Red sun Netaji Rajanna JSR sir )