ఇందిరమ్మ 3వ విడత లో పగిలిన భగీరథ పైపు లైన్ వృధాగా పోతున్న మంచి నీరు
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నిర్వాహకలోపంతో నీరుగారిపోతుంది. పనుల్లో జరిగిన లోపంతో పైపులు లీకేజీ అయి భారీగా నీటి నష్టం జరుగుతోంది. సూర్యాపేట జిల్లా 8 వార్డ్ ఇందిరమ్మ కాలని 3వ విడత లో భగీరథ పైపు లైన్ పగలడంతో మంచి నీరు వృథాగా నేలపాలు అవుతోంది. పాత శివాలయం భగీరథ పైపుల కాసరబాద్ నుంచి ఇందిరమ్మ కాలని 3వ విడత లో వెళ్లే పైపు లైన్ గత కొన్ని నెల్లలు గా మంచి నీరు లీక్ అవుతుంది. నీరు ఒక్కసారిగా బయటికి రావడంతో అదుపుచేయలేకపోయారు. గంటసేపటికి పైగా నీరు వృథాగా పోతూనే ఉంది. నీరంతా ఇందిరమ్మ కాలని 3వ విడత లో ఇండ్ల ముందు మురికి కాలువ లాగా మారుతుంది . అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడంతో చర్యలు చేపట్టలేదు. జిల్లాలో గతంలో కూడా పలుమార్లు పలు చోట్ల పైపు లైన్ లీకేజీ అయినా అధికారులు పట్టించకోలేదని ఇందిరమ్మ కాలని 3వ విడత వారు ఆరోపిస్తున్నారు.