దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో గద్వాల ఉపాధ్యాయుడు నాగరాజు కి ప్రత్యేక బహుమతి

Jan 25, 2025 - 19:55
 0  6
దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో గద్వాల ఉపాధ్యాయుడు నాగరాజు కి ప్రత్యేక బహుమతి

జోగులాంబ గద్వాల 25 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఈ నెల 21 నుండి 25 వరకు పుదుచ్చేరిలో జరిగిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉపాధ్యాయ ప్రదర్శన విభాగంలో పాల్గొన్న G. నాగరాజు, యస్ ఏ (సాంఘీక శాస్త్రం), ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల, గద్వాల  ఉత్తమ ప్రదర్శన కనబరిచి దక్షిణ భారత స్థాయిలో టాప్ - 10 లో నిలిచి ప్రత్యేక బహుమతి అందుకోవటం జరిగింది. ఇట్టి వైజ్ఞానిక ప్రదర్శనలో ఆయన చంద్రకళలు అనే అంశంతో పాల్గొనటం జరిగింది. చంద్రకళలతో పాటు గ్రహణాలు, ఋతువులు, రాత్రి పగలు మొదలైన విషయాలను విద్యార్థులకు సులభంగా బోధించేలా ఆయన వినూత్న భోదనోపకరణాలు రూపొందించి వాటిని ప్రదర్శించటం జరిగింది.

ఇట్టి ప్రదర్శనలో ఆరు రాష్ట్రాల నుండి అనగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల నుండి ఒక్కో రాష్ట్ర నుండి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పది మంది ఉపాధ్యాయుల చొప్పున మొత్తం 60 మంది పాల్గొనటం జరిగింది. కాగా ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నాగరాజు కి ప్రత్యేక బహుమతిగా ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను పుదుచ్చేరి స్పీకర్ సెల్వం, విద్యాశాఖ మంత్రి నమశివాయం, విద్యాశాఖ డైరక్టర్ చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ సందర్భంగా ఆయనను జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ గని , ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట నర్సయ్య  మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333