తోటి స్నేహితునికి కొండంత అండగా నిలిచిన 2007–2008 బ్యాచ్ విద్యార్థులు

Aug 5, 2026 - 00:43
 0  1
తోటి స్నేహితునికి కొండంత అండగా నిలిచిన 2007–2008 బ్యాచ్ విద్యార్థులు

 అడ్డగూడూరు 4 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:– చదువుకున్న రోజులు ముగిసి ఇన్నేళ్లయినా తమ స్నేహ బంధం చెక్కు చెదరలేదని,కష్టాల్లో తోడు నిలిచే ఒక గొప్ప బంధమని అడ్డగూడూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాల పాత విద్యార్థులు నిరూపించారు.ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోటి స్నేహితుడిని ఆదుకోవడానికి 2007-2008 పదో తరగతి బ్యాచ్ మిత్రులంతా మానవత్వంతో కదిలివచ్చారు.రూ. 67,వేల ఆర్థిక సహాయం సేకరణ:ఆ బ్యాచ్‌కు చెందిన అసర్ల మత్స్యగిరి ఇటీవల ఒక ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిన విషయాన్ని తెలుసుకున్న టెన్త్ క్లాస్ మిత్రులు తక్షణమే స్పందించారు. "మేమంతా ఉన్నాం" అంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒకరినొకరు సంప్రదించుకుని,తమ వంతు సహాయంగా రూ" 67,వేల నగదును సేకరించి బాధితుడి కుటుంబానికి అందజేశారు.కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు విపత్కర పరిస్థితుల్లో తమ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చిన క్లాస్‌మేట్స్ కృష్ణ,మధు,రమేశ్,సైదులు, ప్రవీణ్,శ్రీనివాస్,మురళీలతో పాటు ఆర్థికంగా సహాయం అందించిన తోటి స్నేహితులందరికీ మత్స్యగిరి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333