తెలంగాణ ఉద్యమకారుల సమాలోచన సభ సూచనలను పరిశీలిద్దాం
చేసిన తీర్మానాలపై ప్రభుత్వం చొరచూపాలని డిమాండ్ చేద్దాం.
స్పందించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉన్నది.
(నిన్నటి తరువాయి 2 వ భాగం)
--- వడ్డేపల్లి మల్లేశం
ఉద్యమకారుల సమాలోచన రౌoడు టేబుల్ సమావేశంలో సుమారు 100 మందికి పైగా పాల్గొనడంతో పాటు అనేక అంశాల పైన సూచనలు డిమాండ్లు తమ సాధకబాధకాలను ప్రస్తుత ప్రభుత్వానికి చేరే విధంగా నొక్కి వక్కాణించినారు. గత ప్రభుత్వం మాదిరిగా పక్కదారి పట్టకుండా అవినీతికి ఆస్కారం లేకుండా విద్య వైద్యం సామాజిక న్యాయం ఇతర పౌర సంబంధమైన విషయాలలో విజ్ఞల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రజాస్వామిక విలువలు మానవహక్కులను కాపాడుతానని ముఖ్యమంత్రి ప్రకటించిన దానిపై హర్షం వ్యక్తం చేస్తూనే ఆచరణలో చూపించకపోతే ప్రతిఘటన తప్పదని కూడా హెచ్చరించడం పాలకులను ఆలోచింప చేస్తుందని ఆశిద్దాం. దళిత, రైతుబంధు పేరుతో పెట్టుబడిదారులకు దోచిపెట్టడం జరిగిందని , సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడంతో అసమానతలు మరింత పెరిగిపోయినాయని ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి అంతరాలు లేకుండా పాలన కొనసాగాలని ఘాటుగా డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ సాధన కోసం వివిధ దశల్లో పోరాటం చేసింది రాజకీయ మార్పిడి కోసం మాత్రమే కాదని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా, చిన్నాభిన్నమైన వ్యవస్థలు గాడిన పెట్టాల్సిన అవసరం ఉందని ఆ క్రమంలోనే ప్రజా జీవితం మొత్తం చరిత్రకి ఎక్కాలని సూచించడం జరిగింది . ఉద్యమాలతో సంబంధం లేని వారు అధికారంలోకి రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని అయినప్పటికీ ఉద్యమకారుల వద్దకే పాలకులు వచ్చి చర్చించి తమ విజ్ఞతను ప్రదర్శించాలని చేసిన సూచన కనువిప్పు కావాలి .సన్న బియ్యం కోసము, నల్ల నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం సాగలేదని స్వేచ్ఛ కోసం ఆత్మ గౌరవం కోసం ఉద్యోగ ఉపాది అవకాశాలతో పాటు స్వావలoబన కోసం జరిగిన పోరాటం అని భవిష్యత్తు తరాలకు తెలియ చేయవలసిన బాధ్యత ఉద్యమకారులపై, ప్రభుత్వంపై ఉందని సభ అభిప్రాయపడింది . ఇంకా భవిష్యత్తు చావులు, త్యాగాలు, ఆత్మహత్యలు, బలిదానాలతో కొనసాగకూడదని ఫలాలను అనుభవించే దిశగా పాలన గాడిలో పెట్టాల్సి ఉందని అందుకే ఉద్యమకారులు రంగ ప్రవేశం చేయక తప్పడం లేదని సభ అభిప్రాయపడింది.
-_- తెలంగాణ సాధించుకోవడం వల్ల జనానికి ఒరిగింది ఏమీ లేదని పెనం మీద నుండి రొట్టె పొయ్యిలో పడ్డట్టే అయిందని ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మూసలో కొనసాగితే మనం వినడానికి సిద్ధంగా ఉండకూడదు అని మన డిమాండ్లతో వివిధ సందర్భాల్లో ప్రాతినిధ్యాలతో ప్రభుత్వాన్ని ఆలోచింపచేయాలని సభ కోరింది .వివిధ ఉద్యమాల కాలంలో ప్రజల పక్షాన ఉన్నవాళ్లు బుద్దిజీవులు మేధావులు ఉద్యమకారులు చట్టసభల్లో వివిధ హోదాలలో ఉండవలసి ఉన్నదని ప్రభుత్వం ఆ రకంగా వినియోగించుకుంటే మనము కీలకపాత్ర పోషించాలని అన్నారు. ఉద్యమ నేపథ్యం, ప్రజా దృక్పథం ఉన్న వారి ద్వారా పాలనకు సరైన సలహాలు స్వీకరిస్తే మంచిదని, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ కామన్ విద్య ఈ రాష్ట్రంలో సాధించి తీరాలని , సభలు పెట్టుకోవడంతోనే కాదు శాసనకర్తలుగా ప్రభుత్వాన్ని ఆలోచింపచేసే వక్తలుగా ఉద్యమకారులు తమ బాధ్యత నిర్వహించాలనే ఆలోచన చేసింది .
-- విధ్వంసం ముసుగులో నిర్మించినదంతా ఎన్నటికీ అభివృద్ధి కాదని గత 1o ఏళ్ల పాలన అంతా కూడా విద్వo సమేనని కెసిఆర్ అధికారంలోకి వచ్చిన రోజుననే టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు అని మాట మార్చిన తీరును ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన సరళిని తీక్షణంగా పరిశీలించడం ద్వారా మనం అంకుశం లాగా నిలవాలని ఉద్యమకారులు అన్నారు.
-- రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసే ఉచిథా లను రద్దు చేయాలని, రైతు రాజ్యాలను తేవాలని , కార్పొరేట్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం మెడలు వంచి సాధించుకోవాలని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అశేషగ పేద వర్గాలు అసువులు బాసిన వారిని ఇప్పటికీ కేసుల్లో ఇరుక్కున్న వారిని గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రయోజనం జరిగేలా చూడాలని, నీళ్లు నిధులు నియామకాలతో పాటు ఆత్మగౌరవాన్ని సాధించుకోవడానికి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నడుం బిగించాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని సబికులు కమిటీని కోరడం జరిగింది. ఉద్యమకారుల్లో అమరవీరుల కుటుంబాలలో ఇల్లు, కనీస వసతి, ఉపాధి లేని వారికి తక్షణమే కల్పించాలని క్రీడాకారులు, ఇతర ప్రముఖులకు లక్షలు కోట్లల్లో ఇచ్చే దుష్ట సంప్రదాయాన్ని మానుకోవాలని ఈ సభ హెచ్చరించింది .
ఉద్యమకారుల సభ చేసిన తీర్మానాలు --
--ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించి వారికి గృహాలు నిర్మించి ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాలని, పేదవారికి కనీస సౌకర్యాలతో పాటు ఆర్థికంగా భరోసా కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది .
--కాలుష్య రహిత పద్ధతిలో ఉపాధి ఆధారిత పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి అమలుపరచాలి .
-- ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి ఖాళీలను భర్తీ చేసి ఆదాయ మార్గాలను మెరుగుపరచాలి .
--- విద్యా వైద్యం పూర్తిస్థాయిలో ఉచితంగా నాణ్యమైనది అందజేసి బడ్జెట్లో విద్యకు హెచ్చనిధులు కేటాయించాలి.
--- ఉద్యమకారులు మేధావులతో ప్రభుత్వం సమాలోచన జరిపి పారదర్శక పాలన అందించాలి .
-- ఉద్యమకారులపై గల కేసులను రద్దుచేసి అమరుల కుటుంబాలను ఆదుకోవడంతోపాటు గుర్తింపు కార్డులు ఉచిత బస్సు పాసులను అందజేయాలి.
---గత ప్రభుత్వ పాలన పై గల అవినీతి పై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి . పారదర్శక పాలన అందించాలి .
-- ఉద్యమకారుల తెలంగాణ ఆకాంక్షల మేరకు నీళ్లు నిధులు నియామకాల తో పాటు ఆత్మగౌరవము గల ప్రజాస్వామ్య పరిపాలన అందించాలి.
-- ఉద్యమకారులు మేధావులతో కమిటీ వేసి వారి సూచనల మేరకు మెరుగైన పాలన ఆకాంక్షల అమలు దిశగా కృషిచేసి నవ తెలంగాణను సా కారం చేయాలి.
--- తెలంగాణ అస్తిత్వం, ఆకాంక్షలు, ఉద్యమము, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి వారసత్వాన్ని ఉద్యమ నేపథ్య సందర్భాలు సన్నివేశాలను రికార్డు చేయడంతో పాటు ఉద్యమకారుల జీవితాల చరిత్రను నిక్షిప్తం చేయాలి .
సమావేశం నిర్ణయించిన కోర్ కమిటీ ఈ తీర్మానాలతో పాటు సందర్భోచితంగా ముఖ్యమంత్రి ఇతర ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరపాలని సమావేశం సూచించిన డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించే క్రమంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని సమావేశం కోరు కమిటీని కోరింది. ఇంకా ఈ సమావేశానికి మార్గ నిర్దేశం చేసిన వారిలో గురుజాల రవీందర్రావు, మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ , మహిళా ఉద్యమకారులు పాల్గొని ప్రసంగించగా అనేకమంది తమ సాధక బాధకాలను సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. అభిప్రాయాల ఆధారంగా చేసిన తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించి కోర్ కమిటీ పైన బాధ్యతను పెట్టింది. ఇక ప్రాతినిధ్యం చేయాల్సింది కోరి కమిటీ కాగా ఆలోచించి పరిష్కరించవలసినది ప్రభుత్వం. ప్రభుత్వం ఆదమరిచి ఉంటే పూర్వకాలంలో ఇంట్లో కుంపటిని నిరంతరం మండించినట్లు ఉద్యమకారులు తమ ఆలోచనను చర్చలను నిరంతరం వెలిగించాలని నిర్ణయం తీసుకోవడంతో సభ విస్తృత చర్చ అనంతరం ముగిసింది. వ్యాసకర్తగా ఉన్న నేను ఈ సభలో పాల్గొనడం ద్వారా ఈ సమావేశ వివరాలను వ్యాస రూపంలో మీకు అందిస్తున్నాను .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)