తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పి

Jul 17, 2026 - 22:29
 0  2
తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పి

   తిరుమలగిరి 18 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

 సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను సూర్యాపేట డిఎస్పి . ప్రసన్న కుమార్ తనిఖీ చేశారు. డిఎస్పికి ఎస్సై వెంకట్ రెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ముందుగా పోలీస్ స్టేషన్ లో పనిచేసే ,సిబ్బంది ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ..శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు. సీసీ కెమెరాలు అవశ్యకత గురించి ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. రాత్రి పూట మద్యం సేవించి రోడ్లపైకి రాకూడదని ఎటువంటి మత్తు పదార్థాలను వినియోగించారాదని సూచించారు.రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలపై నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.. గ్రామ పంచాయతీ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలందించాలని కోరారు ఎవరైనా పోలీసుల సూచనలను బ్రేక్ చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగేశ్వరరావు ఎస్సై వెంకట్ రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి