తిరుపతి పరకనామ సేవలో మద్దిరాలవాసి చిన్నపాక మురళి
మద్దిరాల 4 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన చిన్నపాక మురళి తండ్రి లింగయ్య తిరుపతి తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో.. భక్తుల సౌకర్యార్థం పరకనామ సేవలో పాల్గొన్నారు. ఎన్ని జన్మలైనా దొరకని పుణ్యం 31–05–2026 నుండి 04–06–2026 వరకు వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.కులం మతం ఏ తేడా లేకుండా తిరుపతికి దేవస్థానానికి వచ్చే భక్తులకు సేవ చేయడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం అని అన్నారు.ఏ పుణ్యక్షేత్రంలోనైనా అవకాశం కల్పిస్తే ఏసేవ చేయడానికి అయినా ముందుంటానని అన్నారు.వారం రోజులపాటు సేవలందించి తిరిగి తన సొంత గ్రామానికి పైనమైనట్టు తెలిపారు.