తాటిపాముల రైతుల కళ్ళల్లో ఆనందం

Sep 24, 2026 - 21:20
Sep 24, 2026 - 22:39
 0  3
తాటిపాముల  రైతుల కళ్ళల్లో ఆనందం

తిరుమలగిరి 25 సెప్టెంబర్  2026 తెలంగాణ వార్త రిపోర్టర్

బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు పూర్తిగా నిండడంతో పరిసర ప్రాంత రైతాంగానికి సాగునీటి భరోసా లభించింది. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ చెక్‌డ్యామ్‌లలో నీరు నిల్వ కావడంతో పంటలకు సాగునీరు అందే అవకాశం ఏర్పడింది  దీంతో పరిసర ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యామ్‌లలో నీటి నిల్వలు భూగర్భజలాల పెంపునకు కూడా దోహదపడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి