తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జోగులాంబ గద్వాల 15 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 07:40 గంటలకు తహసిల్దార్ కార్యాలయం నందు తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి . జాతీయ జెండాను ఎగరవేసి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.
* విద్యార్థులకు పెన్నులు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు, మండల లోని ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. మాతృ భూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి, మనకు సమకూర్చి పెట్టిన ఈ స్వాతంత్ర్య భారత్ నేటితో 79 వసంతాలను పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా ఆ మహానీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలు మనం సమాజానికి ఏవిధంగా సేవాచేయాలని మన విధులను గుర్తు చేస్తాయని అన్నారు. రెవిన్యూ ,సిబ్బంది పూర్తి బాధ్యతతో పని చెయ్యాలని, కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం, ప్రతి బాధితుడికి న్యాయం చేయగలిగినప్పుడే మనం సాధించుకున్న స్వాతంత్ర్య దేశానికి సార్థకత అని అన్నారు. భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న మతాల కలయిక మన భారత దేశం అని, ఇన్ని విభిన్న సంస్కృతి, సాంప్రధాయలున్న వ్యక్తులు లేదా సమూహాల మధ్య సామరస్యం మరియు ఐక్యత భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందని, భారతీయులుగా పుట్టినందుకు మనందరం గర్వపడాలన్నారు.
కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా, ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు.ప్రతి ఒక్కరు తన పని నీ మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్లాలని, ఆశిస్తున్న అంచనాలను అందుకోవాలని,మన విధులను అంకితభావంతో నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇటిక్యాల సర్పంచ్ జీవన్ రెడ్డి, కార్యాలయం సిబ్బంది, ఇటిక్యాల ఎంపీడీవో రమాదేవి, వివిధ శాఖల అధికారులు పోలీస్,సిబ్బందితదితరులు ఉన్నారు.