తగ్గేదే లేదంటున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు 

Dec 19, 2024 - 19:19
 0  5
తగ్గేదే లేదంటున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు 

జోగులాంబ గద్వాల19 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా  పట్టణంలో సమగ్ర శిక్ష  ఉద్యోగుల పదో  రోజు  కూడా తగ్గేదే లేదంటూ  నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు  జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర నాయకులు అయిన రేపల్లి శ్యామరాజు రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు  పాల్గొన్నారు. సభలో ఆయన ప్రసంగిస్తూ గత తొమ్మిదో రోజు నుంచి సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు అందరూ నిరసన  కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే సుమారు పది రోజులైనా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి హామీ రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా  పై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నారు. మావి కనీస కోరికలే. మండల కేంద్రాలలో మరియు తాలూకా జిల్లా స్థాయిలో కూడా మా వాళ్ళు ప్రభుత్వానికి సేవ లు చేస్తున్నారు. ప్రభుత్వాలు మా కోరికలు తీర్చే వరకు ఉద్యోగులు సహనం కోల్పోకుండా శాంతి యుతంగా నిరసనలు తెలపాలి అని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మా ఉద్యోగులు కూడా   ప్రధాన పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. చాలీచాలనీ  వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  కనీసం మా పిల్లలకు ఉన్నతమైన విద్యను కూడా అందించలేకపోతున్నామని ఆయన ఆవేదనా వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం మాపై డేగ  కన్ను వేయకుండా మా కోరికలు మన్నించి మాకు ప్రభుత్వం నుంచి ఉద్యోగ భద్రతను కల్పించాలని అంతేకాకుండా ఉద్యోగ భద్రత కల్పించే వరకు ఎం టి ఎస్ గుర్తింప చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులవలే సెలవులను సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు కూడా గుర్తింప చేయాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333