డీజే లకు అనుమతి లేదు ఎస్ఐ వెంకటరెడ్డి

Sep 1, 2026 - 21:18
 0  3
డీజే లకు అనుమతి లేదు ఎస్ఐ వెంకటరెడ్డి

  తిరుమలగిరి 02 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 వినాయక ఉత్సవాల్లో డీజే సౌండ్‌ సిస్టమ్స్‌ వినియోగించుకునేందుకు అనుమతి లేదని తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో డీజే యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న డీజే లను ఉపయోగించడం వల్ల పండుగ వాతావరణం దెబ్బతింటుందని చెప్పారు. అనుమతి లేని వాటిని వినియోగించి నిబంధనలు ఉల్లం ఘించరాదని సూచించారు. బేఖాతరు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే ముందస్తుగా వినాయక మండప నిర్వాహకులు నుంచి ఎలాంటి అడ్వాన్స్‌లు తీసుకో వద్దని చెప్పారు. అనవసరంగా కేసుల్లో చిక్కుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజే సౌండ్ సిస్టం యాజమాన్యం ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి