డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గట్టుసింగారం యువకులు

Sep 2, 2024 - 22:04
Sep 2, 2024 - 22:05
 0  8
డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గట్టుసింగారం యువకులు

అడ్డగూడూరు 02 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన గ్రామ యువకులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ ని కలవడం జరిగింది.డాక్టర్: ఆలేటి శ్రీనివాస్ గౌడ్ సొంత గ్రామం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామానికి చెందిన ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ను సోమవారంరోజు హైదరాబాద్ ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీలో పవన్ సాయి హాస్పిటల్ లో మర్యాదపూర్వకంగా డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ ని కలిసి వారిని సన్మానించడం జరిగింది.డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ నీరుపేద ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ పేద నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్న డాక్టర్.ఆలేటి శ్రీనివాస్ ని సన్మానించడం జరిగింది.ఈ సన్మానం మాకెంతో సంతోషకరమని యువకులు అన్నారు.ఈ కార్యక్రమంలో చిర్రగూడూరు గ్రామానికి చెందిన శ్రీరాముల ప్రదీప్,మాచర్ల కార్తీక్ చెడే సైదులు,చెరుకు శివరాజు,ఇరుగు సుమన్,ఈదుల విష్ణు జిల్లా రాకేష్,తదితరులు పాల్గొన్నారు.