టీఎంజెఎఫ్ నూతన మండల అధ్యక్షుడిగా నిర్మాల వెంకటేష్
అడ్డగూడూరు 5 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ పోరం (టీఎంజెఎఫ్)యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెపు పరమేష్ అధ్యక్షతన నూతన మండల కమిటీకి హాజరైన సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా అడ్డగూడూరు మండల అధ్యక్షులుగా నీర్మాల వెంకటేశ్వర్లును నియమించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెపు పరమేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చొరవ చూపాలని అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఇల్లు,ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అడ్డగూడూరు మండల అధ్యక్షులు నిర్మాల వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు నీర్మాల సందీప్ ప్రధాన కార్యదర్శి బాలెంల పరుశరాములు కార్యదర్శి మందుల నర్సింహ్మ సభ్యులు గూడెపు నాగరాజు,బాలెంల కల్యాణి,పనుమటి సైదులు,చింత సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.