జోగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ శాఖకు రాష్ట్ర ఉత్తమ పురస్కారం

Aug 16, 2026 - 18:59
 0  2
జోగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ శాఖకు రాష్ట్ర ఉత్తమ పురస్కారం

జోగులాంబ గద్వాల 16 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లా వ్యవసాయ శాఖ పని తీరుకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారం లభించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన వేడుకల్లో జోగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ శాఖ తరపున తాను రాష్ట్రస్థాయి ఉత్తమ పనితీరు అవార్డును రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు గోపి చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు. జిల్లాలో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు, ప్రభుత్వ వ్యవసాయ పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచిందన్నారు.
 జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సహకారంతో జిల్లా. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల అటెండర్లు కృషి వలన ఈ గుర్తింపు సాధ్యమైందని తెలిపారు. ఇకముందు కూడా తమ అధికారులు, సిబ్బంది రెట్టింపైన ఉత్సాహంతో, బాధ్యతతో పని చేసి రైతుల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333