ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం
జోగులాంబ గద్వాల 20 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలంలోని ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో GP, EP, FP, విద్యార్థుల ఇంపోర్ట్, డ్రాప్‌బాక్స్ విద్యార్థుల క్లియరెన్స్, పేర్ల సవరణలు, తరగతుల మార్పు, పాఠశాలల కవరేజ్, ప్రీ-ప్రైమరీ అప్‌డేషన్, ఉపాధ్యాయ–ఉపాధ్యాయేతర సిబ్బంది వివరాల నవీకరణ, ఎన్‌రోల్‌మెంట్, ఆధార్ వాలిడేషన్, APAAR, MBU, SHVR, ECO CLUB, FA1 CCE మార్కులు, స్కూల్ ఫీజు అప్‌లోడింగ్, RTI Act తదితర అంశాలపై సమీక్షించారు. మండల విద్యాశాఖ అధికారి J. అమీర్ పాషా * అన్ని అంశాలపై ప్రధానోపాధ్యాయులకు సూచనలు అందించారు. *జిల్లా సెక్టోరల్ అధికారి ప్రసాద్. హాజరై సంబంధిత అంశాలను వివరించారు. సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు MIS కోఆర్డినేటర్ ఖాజా, CRP రాణెమ్మ పాల్గొన్నారు.