జై భీమ్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షునిగా మహేష్

Jan 18, 2026 - 13:04
 0  84
జై భీమ్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షునిగా మహేష్

తిరుమలగిరి 18 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తాటిపాముల గ్రామంలోని జై భీమ్ అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని  ఎన్నుకున్నారు నూతన అధ్యక్షుడిగా తాటిపాముల మహేష్ ను  ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ  జై భీమ్ అంబేద్కర్ యువజన  సంఘం కృషి కై పాటుపడతానని నా సొంత లాభాన్ని చేకూర్చుకోనని నా మీద నమ్మకంతో నన్ను ఎన్నుకున్న  ప్రతి సభ్యునికి మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు నూతన కమిటీ  ఉపాధ్యక్షుడిగా బందెల ప్రశాంత్  మరియు తాటిపాముల డానియల్  ప్రధాన కార్యదర్శిగా తాటిపాముల నరేష్ ,ఇటికల శేఖర్, క్రీడా కార్యదర్శి తాటిపాముల సిద్దు, కోశాధికారి చెవిటి వినోద్ కుమార్ తాటిపాముల శ్రీను పొట్టి విజయ్ చిటూరి సంజయ్ ముఖ్య సలహాదారులు తాటిపాముల రవి బాకీ రమేష్ ఎర్ర సుధాకర్ చెవిటి జాషువా తదితరులు పాల్గొన్నారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి