జాతీయ జెండాను ఎగురవేసిన సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి
15-08-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామపంచాయతీ ఆవరణంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. గూడెంగ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో కొత్త వెంకట్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద * గూడెం సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా, కొత్త వెంకట్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు,
అక్కడినుండి అంగన్వాడి కేంద్రం దగ్గర జెండా ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా హాజరై పదవీ విరమణ పొందిన ఆయను శాలువాతో సన్మానించి, కాసేపు చిన్నారులతో ముచ్చటించి మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేసుకుని అక్కడినుండి ప్రభుత్వ పాఠశాల యందు పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో జెండా ఎగరవేసిన తర్వాత విద్యార్థులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత గ్రామ పెద్దలు పిల్లలకు ప్రతి సంవత్సరం లాగానే కొన్ని గిఫ్ట్ అందించారు. ఆ తర్వాత కళ్యాణ్ రావు పంపించినటువంటి నోట్ పుస్తకాలను కళ్యాణ్ రావు అనుచరులు అందించారు. చిన్ననాటి స్కూల్ పై మమకారంతో మక్బుల్ భాష, రోడ్డ చిన్న కురుమయ్య, వడ్డే సత్యనారాయణ, కుమ్మరి రాముడు కలసి స్కూలుకు కలర్స్, మరియు స్వాతంత్ర సమరయోధుల ఫోటోస్ ను వేయించారు.
ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి తో పాటు ఉపసర్పంచ్ శోభ, వార్డ్ నెంబర్లు శివకుమార్, పంచాయతీ సెక్రెటరీ, తోట బాలకృష్ణ, శ్రీనివాసులు, బాలస్వామి, నారాయణ, మక్బుల్ భాష, సుధాకర్ నాయుడు అంగన్వాడీ టీచర్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.