జల్లాపురం గ్రామంలో మహిళలు అధికారికంగా ఉంటే భర్తలు ఎందుకు మీటింగ్ లో చలామణి ఎందుకు
అన్ని రూల్స్ తెలిసిన ప్రభుత్వ కార్యదర్శుల మౌనం ఎందుకు?
పంచాయతీ కార్యదర్శి గారు వారికో రూల్స్ మాకో రూల్స్ ఆ
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో వార్డ్ మెంబర్ అధికారికంగా మహిళా ఉంటే పంచాయతీ కార్యదర్శి గారి ఎదుటనే అధికారికంగా ఉన్న మీటింగ్ లో కూర్చోవడం ఎంతవరకు కరెక్టో అధికారులకు మాత్రమే తెలియాలి తమ భార్యల అధికారం అడ్డు పెట్టుకొని పంచాయతీ కార్యాలయంలో తమ భర్తలు కొందరు పెత్తానం చలామణి చేస్తున్నారని అక్కడక్కడా ప్రజలు గుసగుసలుగా మాట్లాడుతున్నారు. ఈ రోజు జరిగిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ మీటింగ్ లో అధికారంలో ఉన్న మహిళలు కాకుండా తమ భర్తలు మీటింగ్ లో కూర్చోడం వల్ల మహిళలను అగౌరపరుస్తున్నట్లు కొంతమంది ఆరోపిస్తున్నారు ఇదేనా మహిళలకు కల్పించిన రాజ్యాంగం హక్కు వారు వారి గృహాలకే అంకితమా అన్న కోశన్? ప్రతి నోట ఇదే మాట వినిపిస్తుంది అన్ని రూల్స్ తెలిసిన పంచాయతీ కార్యదర్శులు మాత్రం చూసి చూడనట్టుగా నిమ్మకి నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.ఇలాంటి మీటింగ్ లో లేదా పంచాయతీ కార్యాలయంలో మహిళలకు అధికారికంగా ఉన్న కుర్చీలో కూర్చుంటున్నా వ్యక్తులపైన మరియు పంచాయతీ కార్యదర్శి గారి పైన పై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు