జగ్జీవన్ రావ్ ఆలోచన విధానాలను యువకులు ఆదర్శంగా తీసుకోవాలి:

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి..

Apr 5, 2024 - 19:05
Apr 5, 2024 - 19:06
 0  4
జగ్జీవన్ రావ్ ఆలోచన విధానాలను యువకులు ఆదర్శంగా తీసుకోవాలి:

నిజామాబాద్, 05 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం, వారి పక్షాన ఎల్లప్పుడూ పోరాటం చేసిన వ్యక్తి అని, తన జీవితకాలం మొత్తం అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి సఫలీకృతం చేసిన మహోన్నత వ్యక్తి అని, అణగారిన వర్గాల ప్రజలకు ఉన్నత పదవులు రావడానికి వారు ఉన్నత పదవులు చేసే విధంగా కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు అని అన్నారు.

 ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్,నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు,కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి,జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్,జిల్లా సేవదల్ అధ్యక్షులు సంతోష్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్ ,విజయ్ పల్ రెడ్డి,మాజీ మేయర్ సుజాత,మహిళా కాంగ్రెస్ నాయకులు గాజుల సుజాత, మలైకా బేగం,మాజీ కార్పొరేటర్ నరేందర్ గౌడ్, ప్రమోద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333