చేనేత శాఖ ఏడిని కలిసిన డీకే స్నిగ్ధ రెడ్డి

Jun 12, 2026 - 02:00
 0  1
చేనేత శాఖ ఏడిని కలిసిన డీకే స్నిగ్ధ రెడ్డి
చేనేత శాఖ ఏడిని కలిసిన డీకే స్నిగ్ధ రెడ్డి

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఏడి ఇందిరా........

చేనేత కార్మికుల సంక్షేమంపై బీజేపీ నేతల చర్చ

జోగులాంబ గద్వాల 11 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు (ఏడి) ఇందిర ను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి స్నిగ్ధ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, కార్యదర్శి ఎగ్బోటీ రవికుమార్ తదితరులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా స్నిగ్ధ రెడ్డి మాట్లాడుతూ గద్వాల జిల్లాలో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రతి అర్హుడైన కార్మికుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే చేనేత ఎన్నికల అంశాలతో పాటు సంఘాల వ్యవహారాలు, కార్మికులకు అందాల్సిన సమాచారం గురించి ఏడి ఇందిరాతో చర్చించారు. చేనేత కార్మికులకు సంబంధించిన ఏ సమాచారం అయినా మధ్యవర్తుల ద్వారా కాకుండా అధికారికంగా ప్రెస్ నోట్‌ల ద్వారా తెలియజేస్తే జిల్లాలోని ప్రతి కార్మికుడికి అవగాహన కలుగుతుందని స్నిగ్ధ రెడ్డి ఏడికి సూచించారు. అలాగే చేనేత కార్మికులకు పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు పొందేందుకు అవసరమైన చేనేత గుర్తింపు కార్డులు అర్హులైన వారికి త్వరగా అందేలా చూడాలని కోరారు. దీనిపై ఏడి ఇందిర స్పందిస్తూ చేనేత కార్మికుల సంక్షేమానికి తమశాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. గుర్తింపు కార్డుల కోసం కార్మికులు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తారని, అనంతరం అర్హులకు కార్డులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిజమైన చేనేత కార్మికులకే అందేలా చూస్తామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీమన్నారాయణ, బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333