చిన్నారులకు జయ స్కూల్ నందు మెరుగైన విద్య
ఘనంగా జయ బ్లాసూమ్స్ కిండర్ గార్టెన్ కన్వకేషన్ సెలబ్రేషన్స్
అందరిని ఆకట్టుకున్న చిన్నారుల ఆటపాటలు
భానుపురి /సూర్యాపేట టౌన్
జయ కిడ్స్ స్కూల్ నందు చిన్నారులకు మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పించడం వలన విద్యార్థులు చక్కని సంస్కార వంతులుగా తీర్చిదిద్ద బడుతున్నారని జయ స్కూల్ కరస్పాండెంట్ వేణుగోపాల్ అన్నారు. బుధవారం రాత్రి శ్రీరామ్ నగర్ నందు జయ బ్లాసూమ్స్ కిండర్ గార్టెన్ కన్వకేషన్ సెలబ్రేషన్స్
కన్నులపండువగా నిర్వహించారు.
జయ స్కూల్ నందు విద్యార్దిలోని మేధా శక్తి ని పెంచడానికి వారికి ఆటపాటలతో విద్యను అందిస్తున్నామని డైరెక్టర్ లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అన్నారు. చిన్నారులకు ఇచ్చే వివిధ ప్రోగ్రామ్ లను తల్లిదండ్రులు కూడ భాగస్వామ్యులైతే చిన్నారులు మరింత తెలివిగా వుంటారని అన్నారు. తల్లిదండ్రులు శ్రద్ద తీసుకునే విద్యార్థులు చదువులో ముందంజలో వుంటారని వారు అన్నారు. తమ స్కూల్ నందు సెకండ్ క్లాస్ విద్యార్థులకు ఇంగ్లీషు, హిందీ సినిమాలు, ప్రోగ్రామ్ లు చూపించడం వలన వారు హిందీ, ఇంగ్లీషు లో చక్కగా మాట్లాడుతున్నారని అన్నారు. జయ స్కూల్ నందు ఉపాధ్యాయులు చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించి తల్లిదండ్రులను మించిన శ్రద్ద వహిస్తున్నారని అన్నారు. మారుతున్న కాలంతో పాటుగా ఆదునిక సాంకేతికను చిన్నారులకు తమ స్కూల్ నందు అందుబాటులో వుంచామని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంటి వద్ద ఆటలు, పాటలతో వారితో గడిపితే పిల్లలు మరింతగా హుషారుగా వుంటారని వారు అన్నారు. కధల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు చదవడం నేర్పించాలని అన్నారు. పిల్లలకు సెల్ ఫోన్ లు ఇఛ్చి వారి భవిష్యత్తు పాడు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.