చిన్నంబావి మండల సాగర్ల నూతన ఎన్నికలు ఏకగ్రీవం

17-04-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన ఉమ్మడి బెక్కిం గ్రామపంచాయతీలో వనపర్తి జిల్లా అడహక్ కమిటీ సభ్యులు అయినటువంటి పల్లె సత్యనారాయణ సాగర, సుగురు మురళి సాగర, చీర్ల జనార్దన్ సాగర, చేన్న రాయుడు సాగర,సుగురు శ్రీను సాగర అధ్యక్షతన చిన్నంబావి మండలం లోని మూడు గ్రామాలు అయినటువంటి పెద్ద బిల్లుకు, నేల బిల్కు, గూడెం గ్రామాలకు నూతన ఎన్నికల లోని మూడు గ్రామాల సభ్యులు పాల్గొని ఈరోజు ఎన్నికలు ఏకగ్రీవంగా జరపడం జరిగింది.
ఈ ఎన్నికలలో గౌరవ అధ్యక్షులుగా జి వెంకటస్వామిని
అధ్యక్షులుగా జే రామచంద్రయ్య సాగర్, ప్రధాన కార్యదర్శిగా ఎం కృష్ణ, కోశాధికారిగా టి కురుమూర్తి, ఉపాధ్యక్షులుగా మామిళ్ళపల్లి బాలకృష్ణ, జె శ్రీనివాసులు, కే శివుడు వీరిని సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.
ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత అధ్యక్షులను, ఉపాధ్యక్షులను కోశాధికారిని వనపర్తి జిల్లా అడక్ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు.
నూతనంగా ఎన్నుకున్నటువంటి అధ్యక్షులు జే రామచంద్ర సాగర్ మాట్లాడుతూ చిన్నంబావి మండలంలో రెండవసారి కూడా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మూడు గ్రామాల ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ నా మీద మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేస్తూ నేను కూడా జిల్లా పెద్దలతో రాష్ట్ర పెద్దలతో చర్చించి చిన్నంబావి మండలానికి భగీరథ మహర్షి విగ్రహాన్ని, అదేవిధంగా చిన్నంబావి మండలానికి ఒక కమిటీ హాల్ను కూడా ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది.
మూడు గ్రామాల సాగరులు అందరూ కూడా అధ్యక్షులు అయినటువంటి జోగు రామచంద్ర సాగర్ ని అభినందించారు