చినుకు పడితే చాలు వాహనదారులకు తప్పని తిప్పలు

అడ్డగూడూరు 15 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం పరిధిలోని మానాయకుంట ఎక్స్ రోడ్ నుండి వెల్దేవి ఆజీంపేటకు వెళ్లడానికి రోడ్డు పరిస్థితి ఇది గుంతలల్ల నీరు నిలిచి అడుగు వేస్తే చాలు ఎక్కడ ఏముందో అర్థం కాని పరిస్థితి..వివిధ గ్రామాల రోడ్ల పరిస్థితి దీనంగా మారాయి.. చినుకు పడితే చాలు వాహనదారులకు తప్పని తిప్పలుగా మారుతున్నాయి. నిత్యం అవసరాల కొరకు 3 మండలాలలోకి కలిపి రోడ్డు పరిస్థితి.. ప్రయాణికులు,రైతులు, వాహనదారులు గత కొన్ని రోజుల క్రితం నుండి వర్షాలకు వ్యాధులు సంభవించడంతో రోగులుగా మారి పక్క మండలం వైద్యం చేయించుకోవడానికి తిరుమలగిరి,శాలిగౌరారం,నకిరేకల్ ప్రభుత్వ ప్రైవేటు దవఖానాల కొరకు ప్రయాణం చేస్తున్న రోగులు,వాహనదారులు పడరాని పాట్లు పడుతూ..ప్రయాణం చేస్తున్నామని అన్నారు. మా గ్రామాలను పట్టించుకోరా..అని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు రోడ్ల పరిస్థితి చూసి గుంతలు పూడ్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామాలలో సర్పంచులు లేక రెండు సంవత్సరాలు గడుస్తున్న ఏ సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమవుతున్న పరిస్థితి నెలకొన్నది. అధికారులు ప్రజాప్రతినిధులు దీన్ని గమనించి పూర్తి చేస్తారని ఆశిస్తున్న గ్రామస్తులు..