చాగాపురం ప్రాథమిక పాఠశాల లో బతుకమ్మ సంబురాలు. 

ఆడి పాడిన చిన్నారులు.

Oct 1, 2024 - 19:34
 0  15
చాగాపురం ప్రాథమిక పాఠశాల లో బతుకమ్మ సంబురాలు. 

జోగులాంబ గద్వాల 1 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- . ఇటిక్యాల చాగాపురం ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు .పాఠశాలలకు దసరా సెలవుల ముందు రోజైనా మంగళవారము విద్యార్థినీలు తీరొక్క పూలతో  బతుకమ్మలను తయారుచేసుకుని అలంకరించుకొచ్చారు. సంప్రదాయం పద్దతి లో బతుకమ్మలకు పూజలు నిర్వహించి, బతుకమ్మ ల చుట్టూ వివిధ రకాల బతుకమ్మ పాటలతో సాంప్రదాయ నృత్యాలతో ఆడి, పాడారు. చిన్నారుల వస్త్ర వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరము  బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయునీయులు  తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333