చాగాపురం గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం గ్రామసభ నిర్వహణ
జోగులాంబ గద్వాల 22 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- నియోజకవర్గం ఇటిక్యాల మండలం పరిధిలోని చాగాపురం గ్రామం లో గ్రామపంచాయతీ ఆవరణ నందు తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన *రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, మరియు ఇందిరమ్మ ఇండ్ల* పథకాల పై గ్రామ సభ ను నిర్వహించి
పంచాయతీ కార్యదర్శి రవి గౌడ్ మాట్లాడుతూ...... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన హామీల ఆరు గ్యారెంటీలలో భాగం లో ఇప్పటికే ఫ్రీ బస్సు , 500 రూపాయల సబ్సిడీ గ్యాస్,200 యూనిట్ కరెంటు, రుణమాఫీ వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది.
అదే విధంగా ఈనెల *26వ తేదీ నాడు* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలకు ప్రారంభించడం జరిగింది ఇందులో రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మరియు రేషన్ కార్డులు పథకాలను అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోని గతంలో గ్రామసభలో నమోదు చేసుకోలేనివారు ఎవరైనా ఉంటే మరొక అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . గ్రామసభ లో అర్హులైన వారికి ఎంపిక చేసి వారికి ఈ సంక్షేమ పథకాలను అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
గ్రామ సభలో ఎవరికైనా రాలేదని వారు ఉంటే .మండల కార్యాలయంలో ఒక్కరికి ప్రజా పాలనలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు.
ఈ సంక్షేమ పథకాలలో నిరుపేదలు భూమిలేని వారికి ఎంపిక చేసి ఇందిరమ్మ భరోసా, ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు ఎకరానికి రెండు పంటలు చొప్పున 12 వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో నిజంగా అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 5 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు.
అలాగే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేయడం జరిగింది. అర్హులైన వారికి ఎంపిక చేసి రేషన్ కార్డు లు అందించడం జరుగుతుంది. అదేవిధంగా. రేషన్ కార్డులో పేర్లను ఎక్కించు కొనడానికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. కొత్తగా వివాహం చేసుకున్న వారికి కూడా రేషన్ కార్డును అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగి రేషన్ కార్డు రానివారు మరొకసారి ఈ ప్రజా పాలనలో గ్రామసభ నందు నమోదు చేసుకుంటే వారికి కూడా త్వరగా రేషన్ కార్డు వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఎవరు అధైర్యపడవద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వివిధ శాఖల శాఖల అధికారులు అంగన్వాడీ టీచర్లు మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.