ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వేడుకలు
తిరుమలగిరి 12 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి పురపాలక సంఘ కార్యాలయంలో నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే సమాజంలో విద్యా విస్తరణ, సామాజిక సమానత్వం కోసం చేసిన సేవలు అమూల్యమని తెలిపారు. ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మాట్లాడుతూ పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.