ఘనంగా బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు
హైదరాబాద్, 05 జూలై 2026 బుధవారం తెలంగాణ వార్త విలేఖరి :- ఎల్బీనగర్ నియోజకవర్గం, మన్సూరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి పుట్టినరోజు మరియు నూతన భారాస పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించబడింది.అదే విధంగా రఘువీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలి ఆశీర్వదించారు. తదనంతరం పుట్టినరోజు వేడుకలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,మిత్రులు, శ్రేయోభిలాషులు పూల బొకేలతో మరియు శాలువాలతో సత్కరించి బర్త్డే కేక్ కత్తిరించి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. మన్సూరాబాద్ డివిజన్ యువ నాయకులు శ్రీ జక్కిడి రఘువీర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా విజయశ్రీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన భారాస పార్టీ కార్యాలయాన్ని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం జన్మదిన వేడుకల్లో పాల్గొని రఘువీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.