ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

Aug 6, 2026 - 19:32
Aug 7, 2026 - 08:46
 0  201
ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్  జయంతి వేడుకలు

తిరుమలగిరి 07 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:-  తెలంగాణ సిద్ధాంతకర్త, ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను తిరుమలగిరి తహసిల్దార్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి  పూలమాల వేసి “జోహార్ జయశంకర్ సార్” అంటూ ఘనంగా నివాళులర్పించారు.అనంతరం డిప్యూటీ తహసిల్దార్ జాన్ మొహమ్మద్ మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం తపించిన ఆచార్య జయశంకర్ సేవలు, తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన దిశానిర్దేశం ఎప్పటికీ మరువలేనివని అన్నారు.జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి