ఘనంగా ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ వేడుకలు.  

జెండా ఆవిష్కరించిన ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు .

Nov 1, 2024 - 20:46
 0  4
ఘనంగా ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ వేడుకలు.  
ఘనంగా ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ వేడుకలు.  

జోగులాంబ గద్వాల 1 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-గద్వాలకార్మిక రాజ్యస్థాపన ద్వారానే శ్రమాజీవులకు మంచి భవిషత్తు 
కార్మికుల పేదల యెక్క ప్రయోజనాలు ఎర్రజెండా రాజ్య స్థాపన ద్వారానే సాధ్యమని అందుకు కార్మికులందరూ ఎర్రజెండాను ఎత్తిపట్టి పెట్టుబడిదారుల మేలుకోసం పనిచేసే ప్రభుత్వాలపై పోరాడాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ఇంటలెక్చువల్ లెక్క్షరర్ గంట పరేష్ బాబులు పిలుపునిచ్చారు.
అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 105వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నాడు గద్వాల పట్టణంలోని నల్లకుంట హమాలీ అడ్డ దగ్గర ఏఐటియుసి పతాకాన్ని జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు ఏగరవేశారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం లో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిన చరిత్ర ఘనమైనదని ఏఐటీయూసీ లో లాల లజపతి రాయ్, నెహ్రు, వివి గిరి, సుభాష్ ఛంద్ర బోస్, సరోజని దేవి, భగత్ సింగ్, డాంగే, ఇంద్ర జిత్ గుప్తా. బర్ధన్, గురుదస్ దాస్ గుప్తా. లాంటి గొప్ప వారు ఏఐటీయూసీ కి నాయకత్వం వహించారని
 ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31లో బాంబే లో ఏర్పాటు జరిగిన తర్వాత కార్మికులకు అనేక సంక్షేమ చట్టాలు,హక్కులు సాధించిన ఏఐటీయూసీ నేడు 104 ఏళ్ళు పూర్తి చేసుకొని 105 వ ఆవిర్భావ వేడుకలుకు సిద్ధం అయిందన్నారు.
 మోడీ ప్రభుత్వం కార్మికులు పొరాడి సాధించిన 29 చట్టాలని 4 కోడ్ లుగా మార్చి కార్మికులకు హక్కులు లేకుండా పెట్టుబడి దారి యాజమాన్యంలకు తొత్తులుగా మారి అనుకూలంగా చట్టాలలో మార్పులు చేశారు అని ఆరోపించారు.
104 సంవత్సరాల చరిత్ర కలిగిన కార్మిక సంఘం దేశంలో ఉన్న పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్య పట్ల సంపూర్ణ అవగాహన ఉండి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కార్మికుల పక్షాన తోడుగా ఉంటూ ఆజరామంగా ముందుకెళ్తున్న ఏఐటియూసి భవిష్యత్తులో మరింత రాజీలేని పోరాటాలకు పూనుకుంటుందని సంఘం ఇచ్చే పోరాట కార్యక్రమంలో కార్మికులంతా తోడుగా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి ఆశన్న, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు కాసీం,aisf ప్రవీణ్, వంశీ, పాషా ,లారి హమాలీ సంఘం నాయకులు నారాయణ, రాజు, వెంకట్రాములు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు మస్తాన్, బైక్ రిక్షా కార్మికులు ప్రభు దాస్, తిమ్మప్ప, దర్మన్న, రాజు, తదితరులతో పాటు 40మంది కార్మికులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333