గ్రూప్ -4 అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు:జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు    

Dec 4, 2024 - 12:15
 0  34
గ్రూప్ -4 అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు:జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు    
గ్రూప్ -4 అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు:జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు    

  జోగులాంబ గద్వాల 4 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:  జిల్లాలో టీజీపీఎస్సీ గ్రూప్ -4 పరీక్షల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు తెలిపారు. బుధవారం ఐ.డి.ఓ.సి ఆవరణలో ఏర్పాటు చేసిన బస్సులను అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన- ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా పెద్దపల్లిలో జరిగే యువ వికాసం  కార్యక్రమానికి గ్రూప్- 4 కు ఎంపికైన అభ్యర్థులు హాజరవుతున్నారని  పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా నుండి ఎంపికైన 98 మంది గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారని తెలిపారు. జిల్లా ఐ.డి.ఓ.సి నుండి ఉదయం మూడు (3) ప్రత్యేక బస్సుల్లో అందరినీ పెద్దపల్లికి తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రయాణ సమయంలో అభ్యర్థులకు భోజనం, త్రాగునీటి వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎ.ఓ.వీర భద్రప్ప,  ఎస్సి కార్పొరేషన్ ఈడి రమేష్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333