గ్రీన్ ఛాంపియన్ 2024 అవార్డు
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షులు ముప్పారపు నరేందర్, ప్రధాన కార్యదర్శి తోట కిరణ్‌లు గ్రీన్ ఛాంపియన్ 2024 అవార్డును అందుకున్నారు. బుధవారం హైద్రాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన సంస్థలకు చెందిన వారికి ప్రిన్సిపల్ సెక్రట్రీ వాణి ప్రసాద్, సుధాకర్ పీవీసీ యాజమాన్యం మీలా జయదేవ్, ప్రొఫెసర్ విజయలక్ష్మిల చేతుల మీదుగా అవార్డులు ప్రధానం చేశారని వారు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా వారి కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.