గ్రామ సభలో ప్రజా ఆగ్రహం,,,,,,,,

Jan 21, 2025 - 18:20
Jan 21, 2025 - 18:22
 0  7
గ్రామ సభలో ప్రజా ఆగ్రహం,,,,,,,,
గ్రామ సభలో ప్రజా ఆగ్రహం,,,,,,,,
గ్రామ సభలో ప్రజా ఆగ్రహం,,,,,,,,
గ్రామ సభలో ప్రజా ఆగ్రహం,,,,,,,,
గ్రామ సభలో ప్రజా ఆగ్రహం,,,,,,,,

లబ్ధిదారుల ఎంపికలో అవక తవకలు జరిగాయని ఆందోళన,,

పారదర్శకత పాటించలేదని ప్రజల అభ్యంతరం,,

చిగురుమామిడి 22 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలలో భాగంగా మంగళవారం చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో ప్రజా పాలన గ్రామసభ మండల ప్రత్యేక అధికారి డాక్టర్ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది, ఈ కార్యక్రమానికి చిగురు మండల కేంద్రం నుండి ఇందిర ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ,పథకాలపై గతంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ప్రకటించడం జరిగింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 106 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా అలాగే రైతు భరోసా కింద 14 మంది ఎంపిక చేయగా, కొత్త రేషన్ కార్డులు 117 మంది కాగా , ఇందిరమ్మ ఇండ్లు 433 మంది లబ్ధిదారుల జాబితాలను చదవటంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడ్డది, పథకాల వారీగా పేర్లు చదువుతున్న క్రమంలో ప్రజల నుండి అభ్యంతరాలు తీవ్రస్థాయిలో పెరిగాయి బిజెపి, బి ఆర్ ఎస్, కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై మాటలతో విరుచుకుపడ్డారు, ఈ ఎంపిక కాంగ్రెస్ వారు చేసిన ?వా లేక అధికారులు సర్వే చేసి ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా? అని ప్రశ్నించారు, దీంతో ఒక్కసారి గా వివిధ పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం పెరిగిపోయింది ఈ క్రమంలో నోడల్ ఆఫీసర్ కలుగజేసుకొని ప్రజలకు నచ్చజెప్పి ప్రకటించిన జాబితాలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలపై మరో మారు దరఖాస్తు చేసుకోవాలని, సూచించారు, ఇందిరమ్మ ఇండ్లు ప్రకటించిన లబ్ధిదారులలో ఎక్కువమంది ఆర్థికంగా బలపడిన వారికి అలాగేఇండ్లు ఉన్నవారికి, ఇల్లు వచ్చాయని, ప్రజల నుండి అభ్యంతరాలు అధికంగా వచ్చాయి పూర్తిగా ఇల్లు లేని, లబ్ధిదారులను ఎంపిక చేయలేదని అలాగే పూరి గుడిసెలలో, అద్దె ఇళ్లల్లో, ఉన్న  వారికి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు రాలేదని ప్రజలు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు , పలువురు ప్రజలు వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ వర్గీయులకు ఎక్కువ ఇండ్లు కేటాయించడం జరిగిందని ఆరోపించారు,  అధికారులు ప్రకటించిన జాబితాలు రద్దుచేసి సమగ్ర సర్వేలు నిర్వహించి అసలు సిసలైన, లబ్ధిదారులను ఎంపిక చేసి , న్యాయం చేయాలని సంబంధిత అధికారులు కోరారు ఈ గ్రామ సభ కార్యక్రమంలో, ఎంపీడీవో బి మధుసూదన్, ఆర్ ఐ తారా దేవి, ఏ ఈ ఓ ఎండి ఫరీ దొద్దిన్ ,పంచాయతీ కార్యదర్శి రమేష్, కరోబార్ గొల్లపెల్లి సత్యనారాయణ చారి, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,,

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333