గ్రామ పంచాయితీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గ్రామ పంచాయితీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి గ్రామ పంచాయతీ వర్కర్స్ & యూనియన్ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు ఆత్మకూర్ (s) మండల కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయం లో ఎంపీవో ప్రియాంక ని కలసి వినతిపత్రం ఇచ్చిన అనంతరం విలేకరుల సమావేశం లో గ్రామ పంచాయతీ వర్కర్స్ & యూనియన్ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు మాట్లాడుతూ నేటికీ కొన్ని గ్రామపంచాయతీ లలో సిబ్బంది అందరికి 3 నెలలు గడిచిన వేతనాలు అందక కార్మికుల కుటుంబాలు అప్పులు తెచ్చి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని తీవ్ర ఎండలో పనిచేస్తున్న కార్మికుల కు జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన సంఘటన అని అన్నారు ఈ కార్యక్రమం లో వాంకుడోతు మల్లేష్, దొడ్డి ప్రవీణ్, రొయ్యల వెంకన్న, బోడ శ్రీను, జలగం సుందర్ సంగం నాయకులు గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు