గ్రామ అభివృద్ధి నా ధ్యేయం సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్

#tirumalagirinews

Jul 25, 2026 - 21:18
Jul 26, 2026 - 01:55
 0  7
గ్రామ అభివృద్ధి నా ధ్యేయం సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్

  ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

 జిల్లాలోనే మొదటి స్థానంలో నిలబెడుతా...

తల్లి బాటలోనే కొడుకు....

తండాలకు ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్....

స్వలాభం కోసం కాదు సొంత గ్రామ అభివృద్ధి లక్ష్యం.....

 సొంత నిధులతో విద్యార్థులకు భరోసా....

తిరుమలగిరి 25 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యే మందుల సామెల్ చొరవతో గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. దీంతో గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కోకియ నాయక తండా స్వలాభం కోసం కాదు సొంత గ్రామ అభివృద్ధి లక్ష్యం ధ్యేయంగా పనిచేస్తున్న సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హాయంలోనే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని వారికి 65 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి ప్రస్తుతం నిర్మాణాలు చేపడుతున్నారు, ప్రస్తుతం రేషన్ కార్డులు లేనివారికి నూతన రేషన్ కార్డులు మంజూరు, కొత్తగా పెళ్లయిన జంటలకు కళ్యాణలక్ష్మి, వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు ఆసరా పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని వారు అన్నారు".

గత పరిపాలనలో.... 

 2014 నూతన తెలంగాణ రాష్ట్రం ఆర్భవించిన తర్వాత తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన అనంతరం నూతన గ్రామ సర్పంచ్ గా గుగులోతు ప్రేమ్ ప్రసాద్ తల్లి తారమ్మ బరిలో నిలబడి 160 ఓట్ల మెజార్టీతో గెలిపిందారు వారి హయాంలో 55 లక్షల రూపాయలతో సిసి రోడ్లు నిర్మాణం ఎనర్జీఎస్ నిధులతో 20 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్లు నిర్మాణం గ్రామ పంచాయతీకి తన సొంత భూమిలో వాటర్ ట్యాంక్ నిర్మించి రెండు బోర్లు వేపించి మంచినీటి వసతి కల్పించారు.............

ఎన్నికల హామీ ఏకగ్రీవంగా ఎన్నిక.... 

  తన తల్లి బాటలో కొడుకు నడవాలి అనే ఉద్దేశంతో కోకియ నాయక్ తండాకు తన వంతు సహాయం చేయాలి ప్రజలకు తోడుగా ఉంటూ పేద ప్రజలకు భరోసాగా నిలుస్తానని కోకియా తండా చక్రు తండా లౌక్య తండా ఈదుల బోడ తండా దేవ తండా గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటానని తల్లి బాటలో కొడుకు నడవాలని సర్పంచ్ ఎన్నికల సమయంలో కోక్య నాయక్ తండా నుండి 15 మంది నామినేషన్ వేయగా స్వచ్ఛందంగా 14 మంది ఉప సవరించుకొని గుగులోతు ప్రేమ్ ప్రసాద్ కు పట్టం కట్టారు.............

సర్పంచిగా గెలిచిన ఆరు నెలల కాలంలో..... 

10 లక్షల రూపాయలతో సిసి రోడ్లు నిర్మాణం 10 లక్షల రూపాయలతో డ్రైనేజీ కాలువల నిర్మాణం ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులను చేర్పించవద్దని ప్రైవేటు పాఠశాలకు పంపిచోద్దని గ్రామ సభలో తీర్మానం చేసి తన కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన సర్పంచ్ ప్రైమరీ పాఠశాలకు అంగన్వాడి సెంటర్ కు సొంత నిధులతో రెండు లక్షల రూపాయలతో ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు విద్యుత్ సమస్యలు తీర్చారు పల్లె ప్రకృతి వనంలో పరిశుభ్రతతో ప్రతి ఒక్క మొక్క పెరగాలని ఉద్దేశంతో పరిశుభ్రత మహాభాగ్యం అంటూ పల్లె ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దారు గ్రామంలో మంచినీటి వసతి కల్పించాలని ఉద్దేశంతో ఉచితంగా గ్రామ ప్రజలకు మంచినీటి వసతి కల్పించారు..........

ఎమ్మెల్యే సహకారం.....

తమ గ్రామానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మందుల సామేలను ఆరు లక్షల రూపాయలతో మంగ్య తండ కోకియా నాయక్ తండాకు లింకు రోడ్డులో మంజూరుకై మరియు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లకు లకు దారి కొరకు మొరం పోయిట సిసి రోడ్డు నిర్మాణం కై పది లక్షల రూపాయలు ఎన్జీఆర్ఎస్ నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనం మంజూరు ఎస్టి కమ్యూనిటీ హాల్ హెల్త్ కేంద్రం మహిళ సంఘాల భవనం కై ఎమ్మెల్యే సామేలుకు గ్రామ అభివృద్ధి కొరకై కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే గ్రామానికి గ్రామ అభివృద్ధికి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు....

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి