గ్రామాలలో కనిపించింది బడిబాట

Jun 9, 2026 - 15:02
Jun 9, 2026 - 16:30
 0  4
గ్రామాలలో కనిపించింది బడిబాట

జోగులాంబ గద్వాల 9 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం మండలంలో ఎక్కడ కనిపించడం లేదు. విద్య సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్న క్షేత్రస్థాయిలో అధికారులు ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాల్సి ఉంటుంది.  కానీ మండలంలోని మెజార్టీ గ్రామాలలో బడిబాట ర్యాలీలు కానీ ప్రచారాలు కానీ నిర్వహించిన దాఖలాలు లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో వసతులు ప్రవేశాలపై సరైన అవగాహన కల్పించేవారు కరువు అవడంతో నిరుపేద తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పించేందుకు ముగ్గు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా ఉన్న అధికారులు స్పందించి మండలంలో బడిబాటకార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.  ఇట్టి విషయంపై మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ని తెలంగాణ వార్త న్యూస్ నుంచి వివరణ కోరగా ఆయా గ్రామాలలో ఉపాధ్యాయులు సర్వే నిర్వహణతో పాటుగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఎక్కడైనా బడిబాట నిర్వహించినట్లు సమాచారం అందితే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State